‘ఇరుముడి’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఓ అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుంది, గ్లింప్స్‌కు వచ్చిన విశేష స్పందనతో ఉత్సాహంతో ఉన్న చిత్రబృందం తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది. వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భంగా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా…
