మే 1న ‘రాక్షసపురం’ విడుదల
కన్నడ చిత్ర పరిశ్రమలో ఘనవిజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డాక్టర్ రవి దర్శకత్వంలో రాజ్ బి శెట్టి హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసపురం’ పేరుతో మే 1న విడుదల చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘ఇది ఒక అద్భుతమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కన్నడ వెర్షన్ చూసిన తర్వాత సినిమాలోని మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సస్పెన్స్ ఎలిమెంట్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నా. సినిమాలో రాజ్ బి శెట్టి ఇన్ స్పెక్టర్ పాత్రలో అద్భుతంగా…
