దుల్కర్ సల్మాన్ #DQ41 ప్రారంభం
వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ అద్భుతమైన స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో ఎప్పుడూ యూనిక్ కథలు, చాలెంజింగ్ రోల్స్ తో అలరిస్తున్నారు. తన 41వ చిత్రం #DQ41 కోసం దుల్కర్, నూతన దర్శకుడు రవి నేలకుదిటితో చేతులు కలిపారు. లవ్ స్టొరీ తో పాటు అద్భుతమైన హ్యుమన్ డ్రామా గా రూపొందనున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. ఇది నిర్మాణ సంస్థ 10వ వెంచర్. #SLV10 మైల్ స్టోన్ గా నిలుస్తుంది. ఈ రోజు హైదరాబాద్లో ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ముహూర్తపు షాట్‌కు నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టారు. దర్శకుడు బుచ్చి బాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, రమ్య…
