Skip to content

‘దండోరా’ సినిమా గురించి 2026 మొత్తం అందరూ మాట్లాడుకుంటారు – నటుడు శివాజీ

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ‘దండోరా’ మూవీ స‌క్సెస్ మీట్‌లో... శివాజీ మాట్లాడుతూ ‘‘హనుమాన్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి ప్రొడ్యూస్ చేయ‌టానికి వ‌చ్చారు. నీల‌కంఠ‌గారైతే త‌రాల‌కొక‌సారే ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని అన్నారు…

Read more

ఇంద్రా కంపెనీ బ్యానర్ పై కొర్రాల సుబ్బారెడ్డి ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్’ (వస్తే వదలం) ఫస్ట్ లుక్ లాంచ్

ఇంద్రా కంపెనీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4గా, కొర్రాల సుబ్బారెడ్డి కొత్త ప్రయత్నంగా తెరకెక్కుతున్న ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్ (వస్తే వదలం)’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ క్రిస్మస్ పండగ సందర్భంగా అంగరంగ వైభవంగా శ్రీనగర్ కాలనీలోని రాంబాబు స్టూడియోలో లాంచ్ అయ్యింది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా రామ సత్యనారాయణ గారు మాట్లాడుతూ – “క్రిస్మస్ సందర్భంగా సుబ్బారెడ్డి డైరెక్టర్-నిర్మాతగా ఇంద్రా కంపెనీ బ్యానర్‌లో కొత్త సినిమా తీసేందుకు ముందుకు రావడం అభినందనీయం. కొత్త డైరెక్టర్లు, కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి అత్యవసరం. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిన్న బడ్జెట్ సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి…

Read more

ఫిలిం ఛాంబర్ ఎన్నికల సందర్భంగా “మన ప్యానెల్” సభ్యుల ప్రెస్ మీట్

తెలుగు చిత్ర పరిశ్రమ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు డిసెంబర్ 28వ తేదీన జరుగుతున్న సందర్భంగా మన బ్యానర్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ... "ఆదివారం ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. చిత్ర పరిశ్రమలో ఛాంబర్ లో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్లాలి. గత పదేళ్లుగా చిత్ర పరిశ్రమ అదుపు తప్పింది. గిల్డ్ అని పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. 20 రోజుల పాటు కార్మికులకు, ఎలాంటి రెస్పాన్స్ రోజుల తరబడి ఇవ్వకుండా తిప్పించారు. నిజానికి గిల్డ్ సభ్యులే చిత్రీకరణలు ఆపారు. వారు స్వార్దం గా వ్యవహరించారు. ఛాంబర్ సభ్యుల పేరిట సిఎంలతో ఫోటోలు దిగాలనే ఆలోచన…

Read more

జనవరి 1న విడుదల కానున్న ‘మదం’

నూతన సంవత్సరం కానుకగా ‘మదం’ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బలమైన ఎమోషన్స్‌తో సాగే ఈ హార్డ్-హిట్టింగ్ డ్రామా థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్యదేవర రవీంద్రనాథ్ (చినబాబు), రమేష్ బాబు కోయ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్ష గంగవరపు, ఇనాయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి ఇందులో కీలక పాత్రలు పోషించారు. రాజీ లేని కథనంతో, వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను రూపొందించినట్లు నిర్మాతలు తెలిపారు. సినిమాలోని ఇంటెన్స్ సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్ కారణంగా సెన్సార్ బోర్డు దీనికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. కథ, మాటలను నిర్మాత రమేష్ బాబు కోయ అందించగా, వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ‘ఈగల్’…

Read more

మన శంకరవరప్రసాద్ గారు నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి నటిస్తున్న క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మ్యాసీవ్ అప్‌డేట్ ఇప్పుడు వచ్చేసింది. ఈ చిత్రంలోని థర్డ్ సింగిల్ ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ అదిరిపోయింది. ఎనర్జీతో నిండిన ఈ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ స్టైలిష్ డాన్స్ పోజుల్లో అదరగొట్టారు. బ్యాక్‌గ్రౌండ్‌లో డ్యాన్సర్లతో కలిసి పూర్తి సెలబ్రేషన్ వైబ్స్‌ను క్రియేట్ చేశారు. డెనిమ్ లుక్, సన్‌గ్లాసెస్‌తో…

Read more

ఛాంపియన్ మా అందరికీ చాలా స్పెషల్ ఫిల్మ్ : హీరో రోషన్

స్వప్న సినిమాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఛాంపియన్'. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషించారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు. పీపుల్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ లో హీరో రోషన్ మాట్లాడుతూ.. మీడియా అందరికీ థాంక్యు సో మచ్. ఛాంపియన్ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను. స్వప్న అక్క నాకు ఎంతగానో…

Read more

అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి ‘రాజు గారి పెళ్లిరో’ విడుదల

వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన మొదటి గీతం 'భీమవరం బాల్మా' ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతంగా 'రాజు గారి పెళ్లిరో' విడుదలైంది. 'అనగనగా ఒక రాజు' నుంచి డ్యాన్స్ నంబర్ గా విడుదలైన 'రాజు గారి పెళ్లిరో' పాట కట్టిపడేస్తోంది. మాస్ తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉత్సాహభరితంగా సాగిన ఈ గీతం.. పండగ వాతావరణాన్ని ముందే తీసుకొని వచ్చింది. తెలుగు ప్రేక్షకుల…

Read more

‘శ్రీనివాస మంగాపురం’ 30 రోజుల మొదటి షెడ్యూల్ పూర్తి

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని రస్టిక్ ఇంటెన్స్ లవ్ స్టొరీ 'శ్రీనివాస మంగాపురం' తో హీరోగా లాంచ్ అవుతున్నారు. విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన లభించింది. టైటిల్ ట్రేడ్ వర్గాలలో, ప్రేక్షకులలో భారీ బజ్‌ను సృష్టించింది. చిత్ర బృందం ఇప్పుడు 30 రోజుల పాటు సాగిన మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో…

Read more

‘మారెమ్మ’ షూటింగ్ పూర్తి

మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌ను మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో మాధవ్ ఎద్దును నడిపిస్తూ ధైర్యంగా ముందుకు వస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. బ్యాక్ డ్రాప్ లో శక్తివంతంగా కనిపించే కాళీదేవి విగ్రహం, చుట్టూ గ్రామీణ పండుగ వాతావరణం, జనసందడి,…

Read more

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాల్లో అమ‌రావ‌తికి ఆహ్వానం

ప్ర‌జెంట్ ట్రెండ్‌లో హార‌ర్ సినిమాలు హ‌వా న‌డుస్తోంది. ఈ ఏడాది విడుద‌లైన అన్నీ హార‌ర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించాయి. ప్ర‌స్తుతం అదే త‌ర‌హాలో ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ క‌థ, క‌థ‌నంతో ప్రేక్ష‌కుల‌కి సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ అనుభూతినిచ్చే విధంగా రూపొందిన చిత్రం అమ‌రావ‌తికి ఆహ్వానం. ఈ సినిమా టైటిల్ కి ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి ఆధ‌రణ ల‌భించింది. శివ కంఠంనేని,ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్త‌ర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సీనియ‌ర్ న‌టులు అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. డైరెక్ట‌ర్ జివికె ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్…

Read more