Skip to content

కొత్తపల్లిలో ఒకప్పుడు’ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు: హీరో మనోజ్ చంద్ర

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ప్రజెంట్ చేస్తున్న రూరల్ కామెడీ 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. C/O కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో అనుబంధం కలిగిఉన్న నటి-చిత్రనిర్మాత ప్రవీణ పరుచూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మనోజ్ చంద్ర, మోనికా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్‌, టీజర్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మనోజ్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపధ్యం ఏమిటి ? సినిమా అవకాశం ఎలా వచ్చింది? -మాది వైజాగ్. ఏరోనాటికల్…

Read more

K-ర్యాంప్” నుంచి ‘ది రిచెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్ రిలీజ్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. "K-ర్యాంప్" మూవీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు " K-ర్యాంప్" సినిమా నుంచి 'రిచెస్ట్ చిల్లర్ గయ్' గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మాస్ ఆటిట్యూడ్ ఉన్న కుమార్ అనే యువకుడిగా కిరణ్ అబ్బవరం కనిపించారు. చిల్ కావడంలో అతనికి…

Read more

‘హరి హర వీరమల్లు’ 20న వైజాగ్ లో ప్రీ రిలీజ్

దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ vs స్పిరిట్'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం జూలై 24, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరో పది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'హరి హర వీరమల్లు' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ ను పొందింది. 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం…

Read more

“పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ లాంచ్ – ఈ నెల 18న సినిమా విడుదల

తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం "పోలీస్ వారి హెచ్చరిక". ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. నేడు ఈ చిత్ర తొలి టికెట్ లాంచ్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన మట్టి కవి బెల్లి యాదయ్య మాట్లాడుతూ... "పోలీసువారి హెచ్చరిక చిత్ర టిక్కెట్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. మా…

Read more

బి. సరోజా దేవి ఇక లేరు

అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రముఖ నటి బి. సరోజా దేవి(87) ఇక లేరు. ఆమె ఈ రోజు బెంగుళూరులోని మల్లేశ్వరంలో తన సొంత ఇంటిలో మృతి చెందారు. తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఒకప్పుడు వెండితెరను ఏలిక హీరోయిన్ బి. సరోజా దేవి. తమిళ, కన్నడ భాషలతో పోల్చితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ కూడా బాగా పాపులర్ ఆమె. తెలుగులో ఈమె నటించిన సినిమాలు.. శ్రీకృష్ణార్జున యుద్ధం, పాండురంగ మహాత్మ్యం, ఆత్మబలం, మంచిచెడు, దాగుడు మూతలు, భాగ్య చక్రం వంటి సినిమాల్లో ఆమె నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. వికిపీడియాప్రకారం బి. సరోజా దేవి జీవితం: ఆమె 1938 జనవరి 7న మైసూర్ రాష్ట్రంలోని…

Read more

“సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు మృతిచెందారు

ప్రముఖ తెలుగు నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు 83 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు తన బహుముఖ ప్రజ్ఞ మరియు శక్తివంతమైన స్క్రీన్ ప్రజెన్స్‌కు ప్రసిద్ధి చెందారుకోట శ్రీనివాసరావు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సినిమా మరియు నాటక నటనా జీవితాన్ని కలిగి ఉన్నారు. 1978లో తెలుగు చిత్రం ప్రాణం ఖరీదుతో కోట శ్రీనివాసరావు అరంగేట్రం చేశారు మరియు తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర భారతీయ భాషలలో 750 కి పైగా చలనచిత్రాలలో నటించారు. అసాధారణమైన నటనకు పేరుగాంచిన కోట శ్రీనివాసరావు, విలన్, క్యారెక్టర్ నటుడు మరియు సహాయ నటుడు వంటి విభాగాలలో తొమ్మిది ప్రతిష్టాత్మక నంది అవార్డులను అందుకున్నారు. 2015లో, భారత ప్రభుత్వం…

Read more

అగ్రహారంలో అంబేద్కర్ అసాధారణ విజయం సాధించాలి!! -“పద్మశ్రీ” మందా కృష్ణ మాదిగ

మన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల స్పూర్తితో రూపొందిన చిత్రం "అగ్రహారంలో అంబేద్కర్". "దళిత సంచలనం" పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించిన ఈ చిత్రం అసాధారణ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ అభిమానులైన ప్రతి ఒక్కరూ "అగ్రహారంలో అంబేద్కర్" చిత్రం చూసి తీరాలని పిలుపునిచ్చారు!! ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ - లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంతా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయనే కావడం విశేషం. ఆయన మాట్లాడుతూ..."అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం…

Read more

‘ఆ గ్యాంగ్ రేపు 3’ ఫస్ట్ లుక్ విడుదల

ఇంతకు ముందు 45 మిలియన్స్‌కు పైగా యూట్యూబ్‌లో వ్యూస్‌ సాధించి వైరల్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా పేరుపొందిన 'ఆ గ్యాంగ్‌ రేపు'తో పాటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు పొందిన స్వీకెల్‌ చిత్రం 'ఆ గ్యాంగ్‌ రేపు-2' షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించిన టీమ్‌ నుండి రాబోతున్న మరో సన్సేషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'ఆ గ్యాంగ్‌ రేపు-3' త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. దర్శకుడు యోగీ కుమార్‌ ఈ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా, నిజాయితీగా.. అందరి హృదయాలకు హత్తుకునే విధంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ లవ్‌ యూ టూ ఓటీటీలో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ సారి ఈ ఆ గ్యాంగ్‌…

Read more

ఈ నెల 16న “ది గర్ల్ ఫ్రెండ్” నుంచి ‘నదివే…’ లిరికల్ సాంగ్ రిలీజ్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'నదివే...' లిరికల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాటను ఈ నెల 16వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 'నదివే...' పాటను బ్యూటిఫుల్ మెలొడీగా కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. చిత్రీకరణ తుది దశలో…

Read more

“స్కై” టీజర్ విడుదల

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వేలార్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "స్కై" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ తో పాటు ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది. మనీ ట్రాన్సాక్షన్ లో జరిగిన మిస్టేక్ హీరో హీరోయిన్స్ మధ్య ఒక బాండింగ్ కు ఎలా దారి తీసింది. హీరో విక్కీ తను అనుకున్న రెస్టారెంట్ బిజినెస్…

Read more