Skip to content

“చంద్రయాన్” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న హిలేరియస్ అడ్వెంచర్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో "చంద్రయాన్" టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన "చంద్రయాన్" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు…

Read more

‘కాకా’ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీ కాకా. వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ‘కాకా’ నెక్స్ట్ భారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ లెన్తీ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి షూటింగ్ లొకేషన్ లో డిస్కస్ చేస్తూ కనిపించారు. ఈ బిహైండ్ ద సీన్ పిక్ సోషల్…

Read more

కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్న రామ్ చరణ్, ఉపాసన

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్ చరణ్, ఉపాసన కొణిదెల తమ ముగ్గురు చిన్నారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో తమ చిన్నారులను ముస్తాబు చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి కృష్ణుడు, రాధారాణి కొణిదెల వారి ఇంట్లోకి అడుగుపెట్టినట్టుగా ఉన్న ఈ అందమైన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఆకట్టుకునే ఈ ఫోటోలపై సోషల్ మీడియాలో అభిమానులు స్పందిస్తూ..''చిరంజీవి గారి ఇంట్లోకి చిన్నారి కృష్ణుడు అడుగుపెట్టాడు 🦚💙” అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 31న రామ్ చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులయ్యారు. వారికి ఒక బాబు, ఒక పాప జన్మించారు. బాబుకి శివరామ్, పాపకి అన్వీరా అని పేరు పెట్టారు.

Read more

అనన్య నాగళ్ల ‘లీసా’ షూటింగ్ పూర్తి; నవంబర్‌లో ఘనంగా విడుదలకు సిద్ధం

ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల…

Read more

“చకోర- లూనార్ లవ్ బర్డ్” సినిమా టీజర్ రిలీజ్

శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా "చకోర- లూనార్ లవ్ బర్డ్". ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ డా.చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దగ్గర ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్ కి రాబోతోంది. ఈ రోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా "చకోర- లూనార్ లవ్ బర్డ్" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన రామ్మోహన్ నాయుడు…

Read more

కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభ‌జే’ ఫస్ట్ లుక్ లాంచ్

▪️సోష‌ల్ మీడియాలో లాంచ్ చేసిన బ్రహ్మాజీ ▪️ భక్తిరస చిత్రంలో మార్కండేయుడిగా బ్రహ్మాజీ ▪️ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న 'కృష్ణంభ‌జే' మూవీ హైదరాబాద్‌: జయశ్రీ మీడియా సమర్పణలో తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కలాల్ శ్రీనివాస్ నిర్మాణంలో నాగరాజ్ కొట్టే ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ సీనియ‌ర్ న‌టుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి కానుకగా బ్రహ్మాజీ 'కృష్ణంభ‌జే' ఫస్ట్ లుక్‌ను సోష‌ల్ మీడియాలో లాంచ్ చేశారు. పోస్ట‌ర్‌లో బ్రహ్మాజీ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. బ్రహ్మాజీ మార్కండేయుడి గెటప్‌లో సంప్రదాయ ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. కాషాయ వస్త్రధారణ, రుద్రాక్ష మాలలు, నుదుటిపై విభూతి, చేతిలో ఆయుధంతో ఆయన లుక్‌ ప్రత్యేకంగా నిలుస్తోంది. భక్తి,…

Read more

మీడియా సమక్షంలో “డెలులు” చిత్ర టీజర్ లాంచ్

“చిరంజీవి గారు నన్ను హీరోగా నమ్ముతున్నప్పుడు నేను కూడా నన్ను నమ్మాలి” - డెలులు చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయ రాజ్ కుమార్ చిరంజీవి గారి వాట్సాప్ స్టేటస్ నా జీవితాన్ని మార్చేసింది - డెలులు చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విజయ రాజ్ కుమార్ క్రియేటివ్ లాంచ్ పాడ్ బ్యానర్ పై ప్రీతం కస్తూరి దర్శకత్వంలో సంకీర్త్ కొండ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం డెలులు. విజయ రాజ్ కుమార్, వేణి రావు, సాయి ప్రసన్న, అఖిల్ జాక్సన్, శ్రీరామ మండవ కీలక పాత్రలు పోషించారు. రేష్మిత్ ఎస్ కౌశిక రచించిన ఈ కథకు విజయ రాజ్ కుమార్ డైలాగులు అందించగా జై…

Read more

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా: నట్టి కుమార్

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమం, శ్రేయస్సు కోసం ఎనలేని కృషి చేస్తానని సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. కౌన్సిల్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్యానెల్ తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా నట్టి కుమార్ ట్రెజరర్ పోస్ట్ కు పోటీ చేస్తుండగా...ఆయన తనయుడు నట్టి క్రాంతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని తన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ, కౌన్సిల్ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పోటీకి నిలబడ్డాయని, అయితే ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను తాను చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు…

Read more

అసలు విషయం ఇదేనా?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కన్నడ స్టార్ హీరో యష్ తల్లి మధ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వివాదం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదానికి కారణమైన వీడియో మాత్రం 2023లో జరిగిన కోటబొమ్మాళి PS సినిమా కార్యక్రమానికి సంబంధించినది కావడం గమనార్హం. ఆ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. KGFకు ముందు, KGF తర్వాత యష్ ఎదిగిన స్థాయి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. ఒక సినిమా, ఒక శుక్రవారం కూడా ఓ నటుడి కెరీర్‌ను పూర్తిగా మార్చగలదనే విషయాన్ని చెప్పే సందర్భంలోనే ఆయన యష్ ఉదాహరణను ప్రస్తావించారు. అయితే తాజాగా ఆ పాత వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి వివాదం మొదలైంది. అల్లు అరవింద్…

Read more

‘అనుమాన పక్షి’ నుంచి అతిగా ఆలోచించకురా సాంగ్ రిలీజ్

‘డిజె టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ కథానాయకుడిగా నటిస్తున్న మరో యునిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనుమాన పక్షి’తో అలరించబోతున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే టీజర్, విభిన్నమైన ప్రమోషనల్ కంటెంట్‌ ఆసక్తిని పెంచింది. తాజాగా ‘అతిగా ఆలోచించకురా’ అనే ఫన్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా హీరో క్యారెక్టర్‌ను ఫన్‌గా ప్రజెంట్ చేస్తోంది. క్యారెక్టర్ స్వభావాన్ని, అతని ఆలోచనా విధానాన్ని సరదాగా చూపిస్తూ పాట సాగుతుంది. పాట విడుదలైన వెంటనే మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఈ పాటకు శ్రీచరణ్ పాకాల ఆకట్టుకునే ట్యూన్ సమకూర్చారు. సాన్వి,…

Read more