Skip to content

మన ప్యానెల్ ప్రెస్ మీట్

సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ : * ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. * నిన్న కొన్ని హామీలు, వగదనలు చేసినవి చూసాము. మేము అలాంటివి ఏం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మేము చేసినవి అందరికీ కనిపిస్తున్నాయి. * నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న కౌన్సిల్ కి గండి కొట్టి గిల్డ్ కు తీసుకుని వెళ్ళి ఆ సొమ్మును అనుభవిస్తుంది ఎవరు? అనేది తెలుస్తుంది. * మా వాళ్ళు 7 మంది ఉంటే మీ వాళ్ళు 16 మంది ఉన్నారు. గత రెండున్నర ఏళ్లగా మీరేం చేశారు? * నిన్న వచ్చి సేవలు చేస్తాం అంటున్నారు. ఇప్పటి వరకు ఏం చేశారు? ఎన్నికల సమయంలో వచ్చి హామీలు…

Read more

మోహన్‌లాల్ పాన్ ఇండియా మూవీ టైటిల్ ‘ఆపరేషన్ గంగా’

సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఎల్367గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి విష్ణు మోహన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆపరేషన్ గంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బైజు గోపాలన్, వి.సి. ప్రవీణ్ కో-ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తుండగా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో, గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా ఇది. ఆయన తొలి చిత్రం ‘మెప్పడియాన్’తోనే నేషనల్ అవార్డు అందుకుని గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఆపరేషన్ గంగా’ ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ చేపట్టిన…

Read more

“పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా నుంచి ‘పనసపల్లి బాలయ్య బ్యాంగ్..’ రిలీజ్

'విరూపాక్ష' ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా "పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్". ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్యాండిడ్ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ప్రొడ్యూసర్ వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని దర్శకుడు సి.హెచ్. రవికిషోర్ రూపొందిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్, మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన 'మెగా సాంగ్' మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ రోజు ఈ చిత్రం నుంచి 'పనసపల్లి బాలయ్య బ్యాంగ్' లిరికల్…

Read more

“ప్రేమనే ఊరిలో” చిత్రం నుండి ‘ఏరై పారే హృదయం’ పాటకు అనూహ్య స్పందన

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే అందమైన పాటకు సమీరా భరద్వాజ్ తన స్వరాన్ని జోడించగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్ ప్రీతిరెడ్డి ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నటి, గాయకి సమీరా భరద్వాజ్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నేను ప్రేమనే ఊరిలో సినిమాలో…

Read more

‘ప్రాణంలో ప్రాణమా’ చిత్ర టైటిల్ సాంగ్ ఆవిష్కరణ

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ప్రొడక్షన్స్ లో రూపొందుతున్న చిత్రం ‘ప్రాణంలో ప్రాణమా’ ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. కుషాల్, అన్విష, జీవన్ రెడ్డి, కమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ ఎస్ హనుమంత రెడ్డి నిర్మాత, భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. తాను ప్రేమిస్తున్న కాజల్ జీవితంలోకి ఇంకో అబ్బాయి రావడంతో, కాజల్ ని అపార్ధం చేసుకుంటాడు కుషాల్. తరువాత ఒకరునొకరు అర్థం చేసుకొని కుషాల్ కాజల్ లు కలిసిపోతారు. ఇది ఈ చిత్ర ముఖ్య కథాంశం, సరికొత్త స్క్రీన్ ప్లే తో దర్శకుడు భార్గవ గొట్టిముక్కల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రానికి డాన్స్ మాస్టర్ జి శంకర్, సినిమాటోగ్రఫీ…

Read more

రజనీకాంత్ ‘ధర్మన్’ రెండవ షెడ్యూల్ పూర్తి

సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 'ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా మేకర్స్ రెండవ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో సూపర్ స్టార్ తనదైన చరిస్మా, ప్రజెన్స్ తో అదరగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య ఉన్నంత స్నేహబంధం చాలా అరుదు. భారతీయ చలనచిత్ర రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ ఇద్దరు దిగ్గజాలు, 'ధర్మన్' చిత్రం ద్వారా నిర్మాత-నటుడిగా మొదటిసారిగా…

Read more

‘రంభ ఊర్వశి మేనక’ కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు: హీరో అల్లరి నరేష్

అల్లరి నరేష్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘రంభ ఊర్వశి మేనక’ ఈరోజు రిలీజ్ అయింది. సింగిల్ స్క్రీన్స్, బి, సి సెంటర్స్‌లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. శని, ఆదివారాలు ఏ సెంటర్స్‌లో కూడా పికప్ అవుతుంది. చాలా రోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా ఇది. ప్రేక్షకులు…

Read more

“టార్టాయిస్” ఒక యూనిక్ థ్రిల్లర్ మూవీ – రాజ్ తరుణ్

రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్". ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "టార్టాయిస్" సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరి దృష్టినీ ఆకర్షించిందీ సినిమా. ఈ రోజు ఈ చిత్రంలోని 'నీ పరిచయం..' పాటను హైదరాబాద్ లో గ్రాండ్ గా…

Read more

థియేటర్ల మనుగడ కోసం ప్రభుత్వంతో చర్చలు: APFDC చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్రప్రదేశ్ సినీ ఎగ్జిబిటర్ల ఫోరమ్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ భరత్ భూషణ్‌కు విజయవాడలో ఎగ్జిబిటర్లు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రాష్ట్రంలోని థియేటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై భరత్ భూషణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫైర్, సినిమాటోగ్రఫీ తదితర శాఖల లైసెన్సుల గడువులు వేర్వేరుగా ఉండటంతో ఎగ్జిబిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్ని శాఖలకు ఒకే విధంగా 5 ఏళ్ల కాలపరిమితితో సింగిల్ విండో విధానంలో లైసెన్స్ రెన్యూవల్స్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడామని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉందని భరత్ భూషణ్ తెలిపారు. ఎఫ్‌డీసీలో ఎగ్జిబిటర్లు మెంబర్‌షిప్ తీసుకోవాలని సూచించారు. ఎగ్జిబిటర్లందరూ కలిసి ఉంటే…

Read more

నాగ చైతన్య లాంచ్ చేసిన ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే ఈ కథలో ఎన్నో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలు, మిస్టరీతో ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా యువ సామ్రాట్ నాగ చైతన్య ‘ది రేజ్ ఆఫ్ వారాహి’ సాంగ్ ని లాంచ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజిషన్ పాటకు ఇంపాక్ట్ తీసుకొచ్చింది. కడలి సత్యనారాయణ రాసిన లిరిక్స్ పవర్‌ఫుల్ గా ఉన్నాయి. నకాష్ అజీజ్ వోకల్స్ ఎనర్జిటిక్ గా ఉన్నాయి. ఈ పాట కథ, వారాహి…

Read more