‘హ్యాపీ’ రీ రిలీజ్‌తో కేరళలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ట్రూ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ అనే పదం పాపులారిటీ పొందక ముందే చాలా మంది యాక్టర్స్ ఆశించే పాన్ ఆల్ ఇండియా స్థాయి గుర్తింపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంపాదించారు. దాదాపు రెండు దశాబ్దాల ముందే ఆర్య, హ్యాపీ, బన్నీ, దేశముదురు వంటి సినిమాల మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా అక్కడి ప్రేక్షకులతో ఆయకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. మలయాళ టీవీ చానెల్స్‌లో తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్స్ ప్రసారమవుతున్న సమయంలోనే అల్లు అర్జున్ తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజన్స్, స్టైలిష్ యాక్టింగ్, డాన్స్ మూవ్స్, అందరికీ కనెక్ట్ అయ్యే రొమాంటిక్ పాత్రలతో మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా మలయాలంలో రీరిలీజైన హ్యపీ సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్…
