విన్‌ఫాస్ట్ కార్ల షోరూమ్ ముందే ఆగిపోయిన కొత్త కారు ప్రశ్నించిన కారు యజమానిపై విన్‌ఫాస్ట్ కార్ల షోరూమ్ నిర్వాహకుల దౌర్జన్యం
హైదరాబాద్ రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ కార్ల షోరూమ్ వద్ద కొనుగోలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు షోరూమ్ బయటే ఆగిపోవడంతో వివాదం నెలకొంది. బాధితుడి కథనం ప్రకారం, జూన్ 2న సుమారు రూ.25 లక్షల విలువైన వీఎఫ్7 విండ్ కారును కొనుగోలు చేయగా, మరుసటి రోజు చార్జింగ్ కోసం షోరూమ్‌కు తీసుకువెళ్లిన సమయంలో కిలోమీటర్ కూడా ప్రయాణించకముందే వాహనం నిలిచిపోయింది. వాహనంలో తలెత్తిన సమస్యను షోరూమ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన లభించలేదని అతను ఆరోపించారు. కారు మార్పిడి చేయడం గానీ, డబ్బులు తిరిగి చెల్లించడం గానీ చేయడం లేదని, సమస్య పరిష్కారంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తనను షోరూమ్ నుంచి బయటకు పంపించారని కూడా ఆయన వాపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా…
