‘ప్రేమంటే’ నుంచి దోచావే నన్నే సాంగ్
స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమా చేస్తున్న ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (SVCLLP)ప్రతిష్టాత్మక బ్యానర్ నిర్మిస్తోంది. స్పిరిట్ మీడియా సమర్పిస్తుంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ 'దోచావే నన్నే'ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు…
