హీరోగా దర్శకుడు బాబ్జీ తనయుడు
తెలుగు సినీ పరిశ్రమలోని నిర్మాతలు తమ తనయులను హీరోలుగా పరిచయం చేస్తూ సినిమాలు తీసేవారు గతంలో.....! ఆ తర్వాత హీరోలు తమ తనయులను హీరోలుగా పరిచయం చేయడం మొదలు పెట్టారు....! ఇప్పుడు దర్శకులు ఆ బాటలో తమ కార్యాచరణ మొదలుపెట్టారు..... కాకపోతే హీరోలుగానే అని గిరి గీసుకోకుండా తమ బిడ్డలకు ఏ విభాగంలో అభిలాష ఉందో , అభినివేశం ఉందో గమనించి ఆ వైపుగా తమ వారసులను నడిపేందుకు , నిలబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు...!! మొన్నామధ్య ఎన్ కౌంటర్ శంకర్ తన కుమారుడి చేతికి మెగా ఫోన్ ఇచ్చి అతి త్వరలో తన బిడ్డ దర్శకుడిగా ఒక సినిమా ప్రారంభమవుతుందని ప్రకటిస్తే..... ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అభ్యుదయ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న…