‘టాక్సిక్’ తెలుగు హక్కులను రూ.120 కోట్లకు సొంతం చేసుకున్న దిల్ రాజు
రాకింగ్ స్టార్ యశ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండిమా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. మార్చి 19న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను రూ.120 కోట్ల (అడ్వాన్స్ ఆన్ కమీషన్ బేసిస్)కు సొంతం చేసుకోవటం ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్‌గా మారింది. నాన్ తెలుగు సినిమాకు కోసం జరిగిన ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ డీల్‌గా మారింది. ఈ ఏడాది విడుదల కానున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీగా టాక్సిక్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…
