Skip to content

#RAPO23- పాండిచ్చేరిలో షూటింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరిస్తోంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో అందమైన లొకేషన్లలో ఓ విజువల్ ట్రీట్‌లా ఉండే పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. అలాగే 'కేజీఎఫ్: చాప్టర్ 1', 'కాంతార', 'కరుప్పు' చిత్రాలకు యాక్షన్ కంపోజ్ చేసిన ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ డిజైన్ చేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. హీరోగా నటిస్తూనే…

Read more

‘అనకాపల్లి’ సినిమాని మంచి సందేశంతో రూపొందించాం – నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు చిత్రానికి సంబంధించిన విషయాల్ని పంచుకున్నారు. వారు చేసిన సంగతులివే.. కాండ్రేగుల నాయుడుతో మీకున్న బంధం గురించి…

Read more

దందా.. జెన్ జీ మాస్ ఊచకోత

80% సినిమా డైరెక్టర్లు కూడా మిక్రోడ్రామ అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అవుతారు! సినిమాల కంటే మైక్రో డ్రామాలను తీయడమే చాలా కష్టం నేను ఎప్పుడు అనుకునే వాడిని నేను 28 years కల్లా డైరెక్టర్ అవ్వాలి అని, అయ్యాను - ‘దందా’ డైరెక్ట‌ర్ ఆదిత్య దేవులపల్లి వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్ సెన్సేషనల్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘దందా’తో దర్శకుడు ఆదిత్య దేవులపల్లి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన సినీ జర్నీ, నేపథ్యం గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే.. మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పండి? నేను చదువులో టాపర్‌నే, కానీ చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే పిచ్చి ఇష్టం. ఆ…

Read more

‘ది రెడ్ బ్యాగ్’ నుంచి ‘నీ వెనకే’ మెలోడీ సాంగ్ రిలీజ్

మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘డిస్కో లైట్’ సాంగ్ యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇక తాజాగా ‘నీ వెనకే’ అంటూ సాగే ఓ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు ఆయన గాత్రం ప్రధాన ఆకర్షణ. ఈ…

Read more

కాలి గాయంపై స్పందించిన రశ్మిక మందన్న.. గాయాలు చికాకు తెప్పిస్తాయని ఇన్ స్టా పోస్ట్

ఇటీవల మైసా సినిమాలో డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా తీవ్రంగా గాయపడింది హీరోయిన్ రశ్మిక మందన్న. ఆమె 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వైద్యుల సూచన మేరకు రశ్మిక బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆమె తాజాగా తన కాలి గాయంపై స్పందించారు. ఇన్ స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో రశ్మిక మందన్న స్పందిస్తూ - గాయాలు అవ్వడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ గాయం గురించి ఎవరికి తెలియకూడదు అనుకున్నా కానీ తెలిసిపోయింది. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడవసారి. తుంటికి కాలుని కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. నా కుడి తుంటిలోని ఒక టెండెన్ ఊడిపోయింది. నేను కాలు…

Read more

#KJQ చాలా డిఫరెంట్ సినిమా.. ఆడియన్స్ ని ఖచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది: హీరో దీక్షిత్ శెట్టి

#KJQ మంచి కంటెంట్ ఉన్న యూనిక్ సినిమా. ఎమోషన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి: హీరో శశి ఓదెల సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మించిన పీరియడ్ క్రైమ్ డ్రామా #KJQ (కింగ్ - జాకీ - క్వీన్). 1990ల నాటి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 'దసరా', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలతో గుర్తింపు పొందిన దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. వీరితో పాటు నూతన నటుడు శశి ఓదెల, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది కన్నుమూసిన దర్శకుడు KK(కిరణ్ )కి ఇది చివరి చిత్రం. ఆయన క్రియేటివిటీ, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి ఇది ఒక నివాళిగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదలైన…

Read more

నాని సమర్పణలో, నితిన్ హీరోగా ‘అలియాస్ రుక్మిణి’ అదిరిపోయే కాన్సెప్ట్ వీడియో రిలీజ్

నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కిన 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ఘన విజయానంతరం ఆయన యూనానిమస్ ప్రొడక్షన్స్ రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'అలియాస్ రుక్మిణి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచింది. అనౌన్స్‌మెంట్ వీడియోలో మొదట నాని, దర్శకుడు మురళీకాంత్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ వినిపిస్తుంది. "కృష్ణ కథ చెబుతాను" అని దర్శకుడు చెప్పగానే, రుక్మిణి అనే రచయిత్రి రాసిన పలు రొమాంటిక్ నవలల కవర్లు కనిపిస్తాయి. వాటిని చూసి "నువ్వు కృష్ణ…

Read more

‘కొరియన్ కనకరాజు’ వరుణ్ తేజ్ గారి పాత్రలోని వేరియేషన్స్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తాయి: దర్శకుడు మేర్లపాక గాంధీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. 'కొరియన్ కనకరాజు' ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. కొరియన్ కనకరాజు కథ ఎలా మొదలైంది? -నేను కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి అనంతపురం మీదుగా ఒక పెళ్లికి…

Read more

‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే అసలైన విజయం – దర్శకుడు రవి నంబూరి సత్తా

▪️50 కోట్ల క్లబ్‌లో 'చెన్నై లవ్ స్టోరీ' ▪️ తొలి సినిమాతోనే దర్శకుడు రవి నంబూరి సత్తా ▪️ తదుపరి చిత్రం కూడా ఎస్‌కేఎన్‌తోనే: రవి నంబూరి హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన "చెన్నై లవ్ స్టోరీ" బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేస్తూ రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీకి విమర్శకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు ఇంకా ఎంతటి ఆదరణ ఉందో మరోసారి ఈ సినిమా నిరూపించింది. ఈ విజయోత్సాహంలో దర్శకుడు రవి నంబూరి తన తొలి సినిమా ఇంతటి విజయం సాధించడం…

Read more

“మాయలేడి” మూవీ గ్లింప్స్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు "మాయలేడి"తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే "మాయలేడి" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "మాయలేడి" సినిమా గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్…

Read more