Skip to content

*డిసెంబర్ 5 నుంచి జీ 5 లో ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో’ స్ట్రీమింగ్‌

ఇండియాలో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ జీ 5 వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కులను ఎప్పటిక‌ప్పుడు ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ లిస్టులో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చేరింది. వెర్సటైల్ యాక్ట‌ర్‌ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుత‌మైన…

Read more

ప్రభాస్ “రాజా సాబ్” సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ పాటను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "రాజా సాబ్" ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్ గా, వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న "రాజా సాబ్" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్…

Read more

*రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు ప్రేక్షకులంతా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు – బన్నీ వాస్

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. "రాజు వెడ్స్ రాంబాయి" విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ చిత్ర సక్సెస్ మీట్…

Read more

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన మహా గ్రూప్ చైర్మన్ వంశీ కృష్ణ

మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహా భక్తి ఛానల్ సారథ్యంలో “తిరుమల తిరుపతి దేవస్థానం” (TTD) వారిచే నిర్వహించబడుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నవంబర్ 26న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా మహా గ్రూప్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు. ప్రతి ఏడాది భక్తి, సంప్రదాయాలతో నిర్వహించే ఈ మహోత్సవం ఈసారి హైదరాబాదులో విశేషమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలుపుతున్నారు. నంబర్ 26వ తేదీన సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. భక్తులందరినీ ఈ…

Read more

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

హైదరాబాద్ భక్తులను పరవశింపజేసేందుకు శ్రీవారి కళ్యాణం సిద్ధమవుతోంది. భక్తకోటి కనుల పండుగగా టీటీడీ ఆధ్వర్యంలో, మహాగ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో గచ్చిబౌలి స్టేడియంలో నవంబర్ 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. త్రైలోక సుందరుడైన శ్రీవారికి జరగబోయే ఈ దివ్య కళ్యాణానికి సంబంధించిన పవిత్ర పోస్టర్‌ను వంశీరామ్స్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి, అపర్ణ గ్రూప్ చైర్మన్ సీవీ రెడ్డి, సుచిర్ ఇండియా అధినేత కిరణ్, స్వగృహ చైర్మన్‌ బీపీ నాయుడు, టీమ్‌ 4 అధినేత యార్లగడ్డ మురళి, మహాగ్రూప్‌ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ సహా పలువురు ఇటీవల ఆవిష్కరించారు. పతిత పావనుడి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు…

Read more

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్

డాక్టర్ శివ రాజ్ కుమార్ & ధనంజయ ముఖ్య పాత్రలుగా హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వస్తోన్న సినిమా 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్, ఈ చిత్ర యూనిట్ ప్రియాంక మోహన్‌ను ఆన్-బోర్డింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ఇప్పుడు లెజెండరీ సూపర్ స్టార్ డాక్టర్ శివ రాజ్ కుమార్ మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి ధనంజయ నేతృత్వంలోని 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ యొక్క నక్షత్ర తారాగణంలో చేరింది. ప్రియాంక మోహన్ తమిళం, తెలుగు మరియు కన్నడ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆమె సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాని, ధనుష్ మరియు శివ కార్తికేయన్‌లతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఓజి, సరిపోద శనివారం, కెప్టెన్ మిల్లర్, డాక్టర్…

Read more

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నాకు చాలా ఎమోషనల్ ఫిలిం -.రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. హై-ఆక్టేన్ ఎనర్జీ, రొమాన్స్, అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్నూల్ లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్…

Read more

12A రైల్వే కాలనీ’ ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో డిఫరెంట్ జోనర్.: మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేస్తోంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. '12A రైల్వే కాలనీ' మీ ఫిల్మోగ్రఫీ లో డిఫరెంట్ గా కనిపిస్తుంది…

Read more

కొదమసింహం” సినిమా నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ, ప్రేక్షకులు ఈ సినిమా రీ రిలీజ్ ను తప్పకుండా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు – మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సక్సెస్, జానర్ పరంగా చూస్తే ఒక ప్రత్యేకమైనదిగా "కొదమసింహం" సినిమాను చెప్పుకోవచ్చు. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ ప్రీమయర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో స్పెషల్ వీడియో ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - కొదమసింహం…

Read more

డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా

తెలంగాణ ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్ లో తినుబండారాల రేట్స్, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర మహాధర్నా నిర్వహించారు. టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ సారథ్యంలో జరిగిన ఈ మహాధర్నాలో నిర్మాతలు లయన్ సాయి వెంకట్, గురురాజ్, డీఎస్ రెడ్డి, రవి, నటుడు, హీరో సన్నీ, దర్శకుడు సిరాజ్ తో పాటు పలువురు దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎఫ్ సీసీ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ - తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు ప్రొడ్యూసర్స్ తమ స్వార్థంతో చేస్తున్న నిర్వాకాల వల్ల…

Read more