Skip to content

పూజా కార్యక్రమాలతో కొత్త సినిమా ప్రారంభం

"ఎస్ఆర్ కళ్యాణమండపం" చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో "హైవే" వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్…

Read more

#LUB చిత్ర ప్రారంభం

జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ పెదమల్లు తొలి దర్శకునిగా పరిచయం అవుతూ ప్రారంభమైన చిత్రం #LUB. ఈ చిత్రం ద్వారా పవన్ కేసరి, ప్రాముఖ్య హీరో హీరోయిన్ గా పరిచయం అవుతుండగా అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, సాయికిరణ్, రోమాంచకం ఫేమ్ మధు, విశ్వనాథ్ & సన్స్ ఫేమ్ హారిక, భాను ప్రకాష్ కడియాల, మోత రాజేందర్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. అక్షయ్ వసూరి డిఓపిగా పని చేస్తున్న ఈ చిత్రానికి కార్తికేయన్ రోహిణి ఎడిటర్ గా, సుధ శ్రీనివాస్ సంగీత దర్శకుడిగా, లిరికల్ రైటర్ గా జైలర్ 2, ఓజి ఫేమ్ శ్రీనివాస…

Read more

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల

▪️ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్: తెలుగు చిత్ర నిర్మాతల మండలి (TFPC) 2026 ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్ష (వైస్ ప్రెసిడెంట్) పదవి కోసం నలుగురు అభ్యర్థులు—మోహన్ వడ్లపట్ల, జీవిత, దామోదర్ ప్రసాద్, భరత్ చౌదరి పోటీ పడ్డారు. వీరిలో ‘మన ప్యానెల్’ తరఫున నిలబడిన మోహన్ వడ్లపట్ల అందరికంటే అత్యధిక మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించి మొత్తం 15 స్థానాల్లో ‘మన ప్యానెల్’కు చెందిన 12 మంది అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ ఆధిపత్యం స్పష్టంగా కనిపించగా, నలుగురి…

Read more

“గోల్డ్ స్పాట్” మూవీ గ్లింప్స్ రిలీజ్

ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న కొత్త మూవీ "గోల్డ్ స్పాట్". ఈ చిత్రాన్ని విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ "గోల్డ్ స్పాట్" సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ రోజు మేకర్స్ "గోల్డ్ స్పాట్" సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. "గోల్డ్ స్పాట్" సినిమా గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే - హీరోయిన్…

Read more

జూబ్లీహిల్స్‌లో సామూహిక శ్రీమంతం

2,000 మంది గర్భిణీ మహిళలకు పుట్టింటి కానుకగా చీర-సారె, పసుపు, కుంకుమ పోషకాహార వారోత్సవాల్లో భాగంగా నవయువ నిర్మాణ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలోని మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో సామూహిక శ్రీమంతం, అన్నప్రాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది గర్భిణీ మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. కాబోయే తల్లులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు వారికి పుట్టింటి కానుకగా చీర-సారెతో పాటు పసుపు, కుంకుమ అందజేశారు. మహిళలతో కలిసి సామూహికంగా శ్రీమంతం నిర్వహించి వారికి శుభాకాంక్షలు…

Read more

నందమూరి మోక్షజ్ఞ తేజ, వశిష్ఠ, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మక చిత్రం అనౌన్స్‌మెంట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కుటుంబానికి, అభిమానులకు ఇది మరో గొప్ప అధ్యాయానికి నాంది పలకనుంది. తన డెబ్యూ కోసం సరైన కథను ఎంచుకునేందుకు మోక్షజ్ఞ కావాల్సిన సమయం తీసుకున్నారు. పలు కథలను విన్న తర్వాత తనకు నచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చేస్తున్న దర్శకుడు వశిష్ఠ ఈ కథను సిద్ధం చేశారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ మైత్రీ మూవీ…

Read more

#NBK111 పవర్‌ఫుల్ టైటిల్ ‘దాదా’, మాస్ ను మెస్మరైజ్ చేసిన టైటిల్ గ్లింప్స్

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. #NBK111కు ‘దాదా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బాలకృష్ణ పోషిస్తున్న పాత్ర స్వభావాన్ని ప్రజెంట్ చేసేలా ఈ టైటిల్‌ ఉంది. పోస్టర్‌లో బాలకృష్ణ మాస్ అవతార్‌లో కనిపించారు. సన్‌గ్లాసెస్‌, లెదర్ జాకెట్‌, మెడలో భారీ గోల్డ్ చైన్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన.. భుజంపై వెపన్‌తో…

Read more

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్యానెల్

తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి సి కళ్యాణ్ గారు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. అలాగే అదే మన ప్యానల్ నుండి చదలవాడ శ్రీనివాసరావు గారు కోశాధికారిగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ గా మన ప్యానెల్ నుండి మోహన్ వడ్లపట్ల గారు, ప్రోగ్రెస్ ప్యానెల్ నుండి దామోదర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా మన ప్యానల్ నుండి అమ్మిరాజు గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు గెలిచారు. ఈసీ సభ్యులుగా ప్రోగ్రెసివ్ ప్యానల్ నుండి ముగ్గురు అనగా మైత్రి రవి గారు, నిరంజన్ రెడ్డి గారు, డిఎస్ రావు గారు గెలవగా మన ప్యానెల్…

Read more

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘పంచనామా’ ట్రైలర్

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే 'పంచనామా' సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. ఉత్కంఠభరితమైన దర్యాప్తుతో పాటు భావోద్వేగాలు, మిస్టరీ, క్రైమ్ అంశాలను ఈ సిరీస్‌లో ఆసక్తికరంగా మేళవించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఆది, ప్రవీణ్, జోసెఫ్ అనే ముగ్గురు అత్యంత దారుణంగా చనిపోతారు. అయితే వీళ్ల చావులను యాక్సిడెంటల్ డెత్‌గా క్లోజ్ చేస్తారు. కానీ ఈ ముగ్గురువి యాక్సిడెంటల్ చావులు…

Read more

“అంతా రాములోరు చూస్కుంటారు” బ్యూటిఫుల్ లవ్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం – హీరో సంగీత్ శోభన్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో "అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని మాట్లాడుతూ -…

Read more