ఘనంగా ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక
అందమైన భావోద్వేగాలతో కూడిన ఆద్యంతం వినోదభరితంగా సాగే చిత్రం 'అనగనగా ఒక రాజు' - కథానాయకుడు నవీన్ పోలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, ఈ సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అసలుసిసలైన పండగ చిత్రంగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'అనగనగా ఒక రాజు'పై భారీ…
