Skip to content

మాస్ అంశాలతో కూడిన వినూత్న చిత్రం ‘మాస్ జాతర’ : దర్శకుడు భాను భోగవరపు

మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న 'మాస్ జాతర' చిత్రం కోసం మాస్ మహారాజా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొంది.. భారీ అంచనాలు…

Read more

‘చైనా పీస్’ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ప్రెజెంటేషన్‌, యాక్షన్‌, థ్రిల్ ,హ్యుమర్ ఎలిమెంట్స్ తో టీజర్ సినిమా పై అంచనాలు పెంచింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. స్ఫూర్తి…

Read more

“రాజు వెడ్స్ రాంబాయి” ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది- నిర్మాత వేణు ఊడుగుల

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ…

Read more

అన్ని జోన్లతో కలిపిన హాలీవుడ్‌ చిత్రం Predator: Badlands

హాలీవుడ్ యాక్షన్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి "ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్" సిద్ధమైంది. దర్శకుడు డాన్ ట్రాచెన్‌బర్గ్ నుంచి వస్తున్న ఈ సినిమా అంచనాలకు మించి ఉందని ఫస్ట్ స్క్రీనింగ్ రిపోర్ట్స్ తెలియజేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం ఒక సూపర్ హార్ట్ టచింగ్ ఎంటర్టైనింగ్, యాక్షన్ అడ్వెంచర్ అని రిపోర్టులు చెబుతున్నాయి. ‘Badlands’ కేవలం రక్తపాతం, వేట గురించి మాత్రమే కాకుండా యాక్షన్‌, సై-ఫై, మానవ సంబంధాలతో కూడిన ఒక మాస్టర్‌పీస్ అని క్రిటిక్స్ కొనియాడుతున్నారు. "All killer, no filler - ఇది ఫన్, ఎమోషన్ నిండిన గెలాక్సీ రోడ్ మూవీ" అని రివ్యూలు దూసుకుపోతున్నాయి. ట్రాచెన్‌బర్గ్ ఈసారి ప్రెడేటర్ యూనివర్స్‌ను మునుపెన్నడూ లేని విధంగా విస్తరించారు. కేవలం సర్వైవల్ గేమ్‌కు…

Read more

‘ఆర్యన్’ తెలుగులో నవంబర్ 7న రిలీజ్

విష్ణు విశాల్ మోస్ట్ ఎవైటెడ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’, ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న విడుదల చేయాలని ముందుగా అనుకున్న ఈ సినిమా నవంబర్ 7కి వాయిదా పడింది. అయితే, తమిళ వెర్షన్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 31న విడుదల కానుంది. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్లతో అలరిస్తున్నారు. టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ అద్భుతమైన స్పందనను పొంది సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. వాయిదాకు గల కారణాలను స్పష్టం చేస్తూ విష్ణు విశాల్ ఒక అనౌన్స్మెంట్ విడుదల…

Read more

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరికీ నచ్చుతుంది.. తిరువీర్

వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్,…

Read more

ఘనంగా ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ వేడుక

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న 'మాస్ జాతర' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ…

Read more

‘ఓ.. చెలియా’ నుంచి ‘నాకోసం ఆ వెన్నెల’ పాట విడుదల

అందమైన ప్రేమ కథగా ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘ఓ.. చెలియా’ పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మరో అందమైన ప్రేమ గీతాన్ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి చేతుల మీదుగా ‘నాకోసం ఆ వెన్నెల’ అంటూ సాగే లవ్, మెలోడీ పాటను టీం విడుదల చేయించింది…

Read more

రవితేజ ‘మాస్ జతర’ ట్రైలర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం 'మాస్ జతర' ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి…

Read more

‘జటాధర’తో తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా వుంది : శిల్పా శిరోధ్కర్

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ…

Read more