“కె ర్యాంప్” ని ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు – కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో మూవీ క్యూ అండ్ ఎ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "కె ర్యాంప్" సినిమా హెవీ ఎంటర్ టైనర్ అని చెబుతూ వస్తున్నాం. మేము చెప్పినట్లే థియేటర్స్ లో దీపావళి పండుగను…
