శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే గాక నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి క్రిస్మస్ విన్నర్ గా నిలిచింది. ముఖ్యంగా ఆదికి మాత్రం శంబాల సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యగంధర్ ముని తెరకెక్కించిన తీరు, కొత్త పాయింట్‌ను టచ్ చేయడం, అన్ని రకాల అంశాల్ని…
