‘పెద్ది’ సినిమా నటుడిగా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది: రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. అద్భుతమైన గ్లింప్స్, చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం విజయవాడలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరైన ఈ వేడుక కన్నుల పండగలా అత్యద్భుతంగా జరిగింది. ఏఆర్ రెహ్మాన్ లైవ్…
