ప్రోగ్రెసివ్ ప్యానెల్ హ్యాండౌట్
1. మన ఇల్లు... మన హక్కు! (చాంబర్ భవనంపై కుట్ర) వాస్తవం: ఈ బిల్డింగ్ మన అమ్మ లాంటిది. 1978లో ప్రభుత్వం ఈ భూమి ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ ఇక్కడ బతకాలని, ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కాదు. కుట్ర: 'మన ప్యానెల్' పేరుతో కొందరు ఇప్పుడు హౌసింగ్ సొసైటీ బ్రోకర్లలా మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ అద్దెకు ఉంటున్నామని, మనకు హక్కు లేదని మన మీదే నిందలు వేస్తున్నారు. బ్రోకర్ల కమీషన్ల కోసం మన సొంత ఇంటిని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఇది అద్దె కొంప కాదు.. మన సొంత ఇల్లు! 2. గిల్డ్ ఎందుకు? (పని చేసే వారికే పవర్ ఉండాలి) నిజం: 20 ఏళ్లుగా ఒక్క సినిమా తీయని…
