Skip to content
పెద్ది’ డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Telugu News

పెద్ది’ డబ్బింగ్ ప్రారంభించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కి ట్రెమండస్ రెస్పాన్స్ తో రికార్డులను బద్దలు కొట్టాయి. తాజాగా రామ్ చరణ్ 'పెద్ది' డబ్బింగ్ ప్రారంభించారు. పెద్ది పాత్రలో చరణ్ చెప్పిన 'ఏమది' డైలాగ్…

Read more
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ ట్రైలర్ Telugu News

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ ట్రైలర్

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ సింగిల్, ఫస్ట్ సింగిల్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మెన్షన్ హౌస్ మల్లేష్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. మురళీధర్ గౌడ్ 'అదొక పెద్ద కథ' అని చెప్పడంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మల్లేష్ క్యారెక్టరైజేషన్, పెళ్లి చూపులు, పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు.. అన్నీ మంచి వినోదాన్ని పంచాయి. డాక్టర్ బ్రాండ్ పేరు అడిగితే 'జై బాలయ్య' అని…

Read more
‘SYG’ 20 కోట్ల బడ్జెట్‌తో 35 రోజుల భారీ క్లైమాక్స్‌ షూటింగ్ Telugu News

‘SYG’ 20 కోట్ల బడ్జెట్‌తో 35 రోజుల భారీ క్లైమాక్స్‌ షూటింగ్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీం ప్రస్తుతం భారీ, హై-ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా 20 కోట్లకు పైగా కేటాయించారు. 35 రోజుల షెడ్యూల్ జరుగుతోంది, ఇందులో 18 భారీ యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ కెవిన్ మాస్టర్…

Read more
మూడు బ్లాక్ బస్టర్ ఇయర్స్ పూర్తి చేసుకున్న తరుణంలో 16 థియేట్రికల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్‌ చేసిన ఈటీవి విన్ Telugu News

మూడు బ్లాక్ బస్టర్ ఇయర్స్ పూర్తి చేసుకున్న తరుణంలో 16 థియేట్రికల్ ప్రాజెక్ట్స్ అనౌన్స్‌ చేసిన ఈటీవి విన్

మూడు బ్లాక్ బస్టర్ ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈటీవి విన్ భారతదేశంలో రీజినల్ కంటెంట్‌కు ఏకైక OTT ప్లాట్‌ఫారమ్‌గా తన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. వరుస ఒరిజినల్ బ్లాక్‌బస్టర్లతో కేవలం మూడు ఏళ్లలోనే తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. మూలాలకు దగ్గరగా ఉన్న కథలను ప్రేక్షకులకు అందిస్తూ, దేశవ్యాప్తంగా, విదేశాల్లో విశ్వసనీయమైన సబ్‌స్క్రైబర్ బేస్‌ను నిర్మించుకుంది. గత ఏడాది బ్లాక్ బస్టర్ ఇయర్ నిలిచింది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, అనగనగా, కానిస్టేబుల్ కనకం, AIR వంటి వరుస విజయవంతమైన ఒరిజినల్స్ అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయ పరంపర ETV Winను రీజినల్ OTT రంగంలో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిపింది. ఈ…

Read more
‘విష్ణు విన్యాసం’ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: ప్రెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు Telugu News

‘విష్ణు విన్యాసం’ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: ప్రెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ 'విష్ణు విన్యాసం'. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ... అందరికి నమస్కారం. విష్ణు విన్యాసం నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేశాం. నేనెప్పుడూ కూడా ఫ్యామిలీస్ యూత్ ని నమ్ముకునే సినిమాలు చేస్తాను. వాళ్ల రెస్పాన్స్ ఫస్ట్…

Read more
‘శ్రీనివాస మంగాపురం’ నుంచి వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు ఫెరోషస్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు ఫెరోషస్ ఫస్ట్ లుక్ రిలీజ్

హార్డ్ హిట్టింగ్ సినిమాలు అందించడంలో పాపులరైన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం' శ్రీనివాస మంగాపురం' చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. వైరల్ అయిన ఉయ్ అమ్మ ట్రాక్‌తో దేశవ్యాప్తంగా అలరించిన తర్వాత రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్న శ్రీనివాస మంగాపురం ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో స్ట్రాంగ్ బజ్‌ను సృష్టించింది. ఈరోజు, మేకర్స్ ఈ చిత్రంలో మరో ప్రముఖ పాత్రను పరిచయం చేశారు. వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు ఫెరోషస్…

Read more
‘మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్’ షో కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈ షోకి జడ్జ్ గా వుండటం ఆనందంగా ఉంది: ప్రెస్ మీట్ లో రావిపూడి Telugu News

‘మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్’ షో కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈ షోకి జడ్జ్ గా వుండటం ఆనందంగా ఉంది: ప్రెస్ మీట్ లో రావిపూడి

అఫీషియల్ ప్రీమియర్‌ కి ముందే జియోహాట్‌స్టార్ రూపొందిస్తున్న కొత్త రియాలిటీ షో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్' ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. షో చిత్రీకరణ జరుగుతున్న గ్రాండ్ లొకేషన్ “లవ్ మాన్షన్” లోపలి ఎక్స్‌క్లూజివ్ చిత్రాలు బయటికి వచ్చాయి. ఈ విశాలమైన మాన్షన్‌లో ప్రస్తుతం 10 మంది సెలబ్రిటీ జంటలు 70 రోజుల ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రేమ, నమ్మకం, సహనం, భాగస్వామ్యాన్ని 24/7 కెమెరాల పర్యవేక్షణలో పరీక్షించే విధంగా ఈ లవ్ మాన్షన్‌ను డిజైన్ చేశారు. మాన్షన్‌లో ఇప్పటికే కొన్ని జంటలు మరింత బలపడుతుండగా, మరికొన్ని జంటల మధ్య అనుకోని భావోద్వేగ ఘర్షణలు జరుతున్నాయి. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా, నిరంతరం కెమెరాలు రికార్డ్ చేస్తున్న ఈ లవ్ మాన్షన్…

Read more
‘స్పిరిట్’ పవర్ ఫుల్ రోల్ లో వివేక్ ఒబెరాయ్ లుక్  రిలీజ్ Telugu News

‘స్పిరిట్’ పవర్ ఫుల్ రోల్ లో వివేక్ ఒబెరాయ్ లుక్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్–వరల్డ్ ప్రాజెక్ట్ 'స్పిరిట్' లో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ చేరింది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో కనిపించబోతున్నారు వివేక్ ఒబెరాయ్. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఒబెరాయ్ కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ఇంటెన్స్ గా కనిపిస్తూ హై-స్టేక్స్ యూనివర్స్‌లో తన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతోందో చూపించారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన రాకతో కథలో కొత్త డైనమిక్ చేరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ లో ఐశ్వర్య దేశాయ్‌ ను పరిచయం చేశారు మేకర్స్. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుంది. యానిమల్ సంచలన విజయం తర్వాత నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్…

Read more
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి  హోంబాలే ఫిల్మ్స్ Telugu News

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి హోంబాలే ఫిల్మ్స్

కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతార, కాంతార చాప్టర్ 1, సలార్, మహావతార్ నరసింహ వంటి ల్యాండ్‌మార్క్ బ్లాక్‌బస్టర్‌లతో భారతీయ సినిమాను రీడిఫైన్ చేసిన తర్వాత హోంబాలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్‌లోకి అధికారికంగా ప్రవేశించినట్లు ప్రకటించింది. ఇది సంస్థ ప్రయాణంలో ఒక కీలక అధ్యాయం. భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృత ప్రేక్షకులకు చేరవేయాలనే స్పష్టమైన లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. భాషలు, సంస్కృతులను దాటి ప్రేక్షకుల హృదయాలను తాకే భారీ చిత్రాలను నిర్మించిన అనుభవంతో, ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ అంతర్జాతీయ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రయత్నం హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సినిమాలకు మాత్రమే పరిమితం కాదని సంస్థ స్పష్టం చేసింది. భారతదేశంలోని…

Read more
9 దేశాల టాప్ మ్యూజిక్ చార్టులలో అదరగొడుతున్న  ‘ది ప్యారడైజ్’ ఆయా షేర్ సాంగ్ Telugu News

9 దేశాల టాప్ మ్యూజిక్ చార్టులలో అదరగొడుతున్న ‘ది ప్యారడైజ్’ ఆయా షేర్ సాంగ్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ది పారడైస్ ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. విడుదలైన కొద్దిసేపటికే ఆయా షేర్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఈ పాట యూట్యూబ్ గ్లోబల్ చార్ట్స్‌లో 9 దేశాల్లో ట్రెండింగ్‌లో నిలిచింది. భారత్, యూఏఈలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోగా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, సౌదీ అరేబియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా అద్భుతమైన ర్యాంకులు సాధించింది. ఒక తెలుగు పాటకు ఈ స్థాయి అంతర్జాతీయ ఆదరణ రావడం విశేషం…

Read more