బెంగళూరులో ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ టీజర్ విడుదల
▪️సినీ ప్రముఖుల సమక్షంలో కన్నడ వెర్షన్ టీజర్ విడుదల ▪️ వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు ▪️ 45 రోజుల్లో 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ బెంగళూరు: సౌతిండియా ప్రేక్షకుల ముందుకు యాక్షన్, కామెడీ, హారర్ థ్రిల్లర్ కలగలిపిన సినిమాను తీసుకురాబోతున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, రాగిణి ద్వివేది, కృష్ణ సాయి ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ వెర్షన్ టీజర్‌ను బెంగళూరులో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమం చిత్రబృందం, అతిథుల సందడితో హర్షాతిరేకంగా జరిగింది. ఈ వేడుకకు ‘దేవి’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటి ప్రేమ, ‘దండుపాళ్యం’ ఫేమ్…
