‘యుఫోరియా’ సినిమాను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: డైరెక్టర్ గుణశేఖర్
భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో... డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘యుఫోరియా’ మూవీ సినిమాకు మార్నింగ్ షో నుంచే మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ టైటిల్ చూసి యూత్ వస్తారని అనుకున్నాను. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వస్తున్నారు. భూమికగారు, సారా అర్జున్ అందుకు కారణం కావచ్చు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా నుంచి ఏదైతే ఆశించామో అది వస్తుంది. రెగ్యులర్ కమర్షియల్…
