Skip to content

15 ఏళ్ల నా కల పంచనామాతో నెరవేరింది – ఉదయభాను

తెలుగు ప్రేక్షకులను అలరించేలా విభిన్నమైన, ఆసక్తికరమైన కథాంశాలతో ముందుకు సాగుతున్న జీ5 మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే 'పంచనామా' సిరీస్. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతుంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం ప్రివ్యూ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, షో రన్నర్ ఉదయభాను మాట్లాడుతూ.. ఈరోజు నేను ఎమోషనల్ అవ్వకూడదని అనుకున్నాను. నిర్మాతగా మారాలనేది నా సాధారణ కల కాదు. దాదాపు 15 ఏళ్లుగా ఒక తపస్సు చేస్తున్నాను. టెలివిజన్‌లోనే పుట్టాను, ఉదయభాను కాస్తా హృదయభానుగా మారింది అక్కడే.…

Read more