‘బంగారం’ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: డెమాన్ పవన్
సోషల్ మీడియాలో వైరల్ మారిన డెమాన్ పవన్, రీతూ చౌదరి 'బంగారం' సాంగ్ బిగ్‌బాస్ ఫేమ్ డెమాన్ పవన్, రీతూ చౌదరి జంటగా నటించిన 'బంగారం' ఆల్బమ్ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మెలోడీ, విజువల్స్, ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ పాట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మొదటి నుంచి చివరి వరకు ఫీల్‌గుడ్ రొమాంటిక్ వైబ్‌తో సాగే ఈ పాటలో డెమాన్ పవన్, రీతూ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా ఉండటంతో ఈ పాటను ప్రేక్షకులు మరింతగా ఆస్వాదిస్తున్నారు. ఈ పాటకు అఫ్రోజ్ అలీ సాహిత్యం అందించడంతో పాటు స్వరపరిచి, స్వయంగా ఆలపించారు. సమీరా భరద్వాజ్ వోకల్స్…
