అక్టోబర్ 2న హిందీ జీ5లో ప్రీమియర్ కానున్న ‘పూజా మేరీ జాన్’
ప్రతి కథ కూడా సులభంగా అందరికీ అర్థమైయ్యేలా ఉండదు. కొన్ని కథలు మనల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి.. మనం సహజంగా అంగీకరించే విషయాలను కూడా ఆ కథలు ప్రశ్నించేలా చేస్తాయి.. చూడకూడదనుకునే నిజాలను ఎదుర్కొనేలా మనల్ని సిద్ధం చేస్తాయి. అలాంటి కథే ‘పూజా మేరీ జాన్’. నవ్‌జోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. మ్యాడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘పూజా మేరీ జాన్’ అక్టోబర్ 2, 2026న హిందీ జీ5లో ప్రీమియర్ కానుంది. బలమైన ఇన్టెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. పూజా చుట్టూ చోటుచేసుకునే కలవరపరిచే ఘటనల నేపథ్యంలో సాగుతుంది. తిరస్కరణ, వ్యామోహం, నిజాన్ని అంగీకరించటం, అసలు ఏం జరిగిందనే నిజం వంటి అంశాలపై…
