‘విశ్వనాథ్ & సన్స్’ టైటిల్ ఖరారు
ఆకట్టుకుంటున్న 'విశ్వనాథ్ & సన్స్' ఫస్ట్ లుక్.. త్వరలోనే టీజర్ విడుదల సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 'సూర్య46' చిత్రానికి 'విశ్వనాథ్ & సన్స్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పేరు విన్న తక్షణమే ఒక క్లాసీ, స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రాన్ని చూడబోతున్నామని స్పష్టమవుతోంది. సూర్య ఒక చిన్నారితో కలిసి కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు.. మధుర జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, సూర్యలోని పాతకాలపు మాధుర్యాన్ని మళ్లీ తెరపై చూపిస్తూ ప్రేక్షకులకు అందమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. భారీ స్థాయి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'సార్/వాతి', 'లక్కీ భాస్కర్' వంటి వరుస విజయాలతో…
