‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదల
తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన, హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దర్శకుడు వెంకీ అట్లూరి తనదైన భావోద్వేగ కథనంతో రూపొందించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో ఒకటిగా ఈ చిత్రం నిలవనుంది. ట్రైలర్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను పరిచయం చేశారు. నలభై ఏళ్ల వయస్సు దాటినా తన కలలను వదలకుండా ముందుకు సాగే వ్యక్తిగా సూర్య కనిపించారు. స్టైల్, హాస్యం, ప్రేమ,…
