నరేష్ విజయకృష్ణకు గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు సత్కారం
వెర్సటైల్ యాక్టర్ నవరసరాయ డా. నరేష్ విజయకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా గోవా రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గోవా గౌరవనీయ గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు, డా. నరేష్‌ను ఘనంగా సత్కరించారు. భారతీయ సినీ పరిశ్రమలో 55 ఏళ్ల సుదీర్ఘ, విశిష్ట ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ డా. నరేష్‌ను అభినందించి రాజ్‌భవన్‌లో సత్కరించారు. గోవాలోని తెలుగు కమ్యూనిటీ సభ్యులు డా. నరేష్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను లోక్‌భవన్‌కు ఆహ్వానించగా, అక్కడ చారిత్రాత్మక భవనాన్ని సందర్శించారు. గౌరవనీయ గవర్నర్ ఆయనకు టీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డా. నరేష్…
