‘యమకింకరుడు’ ట్రైలర్ విడుదల చేసిన నిర్మాత కె.ఎస్. రామారావు!
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర పోషిస్తూ, దర్శకత్వం వహించి నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘యమ కింకరుడు’. తెలుగు సినీ చరిత్రలోనే మొదటిసారిగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతతో రూపుదిద్దుకున్న చిత్రంగా ఇది చరిత్ర సృష్టించనుంది. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్ సుమన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉందంటూ చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ: "తెలుగు ఇండస్ట్రీలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రామసత్యనారాయణ ఎప్పుడూ ముందుంటారు. AI సాంకేతికతతో తెలుగులో మొదటి సినిమా…
