Skip to content

వార్ 2 అత్య‌ధిక వ్యూస్‌తో స‌రికొత్త హిస్ట‌రీ

వార్ 2 ట్రైల‌ర్‌లో పాన్ ఇండియ‌న్ స్టార్స్ హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ ఫెరోషియ‌స్ లుక్‌లో అద‌ర‌గొట్టారు. నువ్వా నేనా అన్న‌ట్లుగా పోటీప‌డుతూ హృతిక్‌, ఎన్టీఆర్‌ మ‌ధ్య సాగే యాక్ష‌న్ సీక్వెన్స్ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. టాప్ నాచ్ విజువ‌ల్స్‌, బీజీఎమ్‌తో పాటు ఐ ఫీస్ట్‌గా సాగుతూ ఆడియెన్స్‌కు గూస్ బంప్స్‌ను క‌లిగించింది. ట్రైల‌ర్‌...ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల్ని రెట్టింపు చేసింది. ఇద్ద‌రు మెగాస్టార్స్ విశ్వ‌రూపాన్ని సిల్వర్ స్క్రీన్‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ పిల్మ్స్ ప‌తాకంపై ఆదిత్య చోప్రా ఈ సినిమాను…

Read more

వార్‌ 2 ట్రైలర్‌ విడుదల

హృతిక్‌ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్‌ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో ‘వార్‌ 2’ ఆరవ చిత్రంగా రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని బుధవారం విడుదల చేశారు మేకర్స్‌. ఇద్దరూ గొప్ప నటులు నువ్వా నేనా అని పోటీ పడి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఆడియెన్స్‌కి ఎప్పటికీ గుర్తుండి పోతుంది

Read more

‘వార్ 2’ 25న ట్రైలర్ రిలీజ్

#War 2 మూవీకి సంబందించి 25వ నెంబర్‌కి ఓ ప్రత్యేకత ఉంది. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లను ఒకే సినిమాలో నటింపజేసే అపూర్వ అవకాశాన్ని నిర్మాత ఆదిత్య చోప్రా సాధించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ రూపొందిస్తోన్న ప్రెస్టీజియస్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న WAR 2ను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ సంవత్సరం తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారన్నది ఒక అద్భుతమైన విషయం. ఇది యాదృచ్చికంగా జరిగినప్పటికీ ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా WAR 2 ట్రైలర్‌ను జూలై…

Read more