Skip to content

వారాహి సిల్వర్ జ్యువెలరీ పాషన్, విజన్ చాలా నచ్చింది: తేజ సజ్జా

-గ్రాండ్ గా జరిగిన వారాహి సిల్వర్ జ్యువెలరీ- ప్రీ-లాంచ్ ఈవెంట్
వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫ్లాగ్లిప్ స్టోర్ ని మార్చి 28న వారాహి సిల్మ్స్, 1వ అంతస్తు, మెట్రో పిలర్ A756 ఎదురు, కెపిహెచ్ బి ఫేజ్ 1, కూకట్పల్లి గా గ్రాండ్ ఓపెనింగ్ చేయనుంది. మరింత ఆసక్తిని పెంచుతూ వారాహి సిల్వర్ జ్యూవెలరీ ఘనంగా ప్రీ-లాంచ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.
ఈ ఈవెంట్ లో, తేజ సజ్జా, మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించారు. బ్రాండ్ కొత్త ప్రకటనను ఆవిష్కరించారు. ఆ ప్రకటనలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి, మహారాజా-మహారాణీ లుక్ లో ఎంతో రాజసంగా కనిపిస్తూ, బ్రాండ్ యొక్క ఎలిగెన్స్ ను అద్భుతంగా ప్రతిబింబించారు.
ప్రెస్ మీట్ లో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మనమంతా బంగారం లేదా వెండి కొనాలనుకుంటే, సాధారణంగా ఒకే బ్రాండ్‌ను తరతరాలుగా నమ్మి కొనుగోలు చేస్తుంటాం. ఎందుకంటే ఆ బ్రాండ్‌పై మనకు ఉన్న నమ్మకం. అలానే మణిదీప్ గారిని కలిసినప్పుడు, ఆయన పాషన్ విజన్ నాకు చాలా నచ్చాయి. ఒకసారి ఆయన బ్రాండ్‌లో కొనుగోలు చేస్తే, జీవితాంతం అదే బ్రాండ్‌ను ఫాలో అవుతామని నాకు నమ్మకం వచ్చింది. మణిదీప్ గారు, స్పందన గారు నమ్మకం గల వ్యక్తుల్లా అనిపించారు. అదే ఈ బ్రాండ్‌కు నేను అసోసియేట్ కావడానికి ముఖ్య కారణం. ఈ సిల్వర్ జ్యువెలరీ భవిష్యత్తుపై నమ్మకం ఇస్తుంది. అలాగే సిల్వర్ ధరలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి, ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అని నేను నమ్ముతున్నాను. మార్చి 28న కూకట్పల్లిలో ఈ బ్రాండ్ యొక్క మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం అవుతోంది. అద్భుతమైన డిజైన్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా నన్ను జ్యువెలరీతో చూస్తే, అది ఖచ్చితంగా వారాహి జ్యువెలరీ అని ఫిక్స్ అయిపోండి (నవ్వుతూ). అందరూ తప్పకుండా వచ్చి స్టోర్‌ను సందర్శించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మణిదీప్ గారికి, స్పందన గారికి, వరాహి టీమ్‌కు ధన్యవాదాలు. మీనాక్షి గారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ: అందరికీ హ్యాపీ ఉగాది! మణిదీప్ గారికి, స్పందన గారికి హృదయపూర్వక అభినందనలు. నేను గత ఏడాదిగా వారాహి బ్రాండ్‌తో అసోసియేట్ అయ్యాను. ఈ బ్రాండ్‌ను వారు ఎంతో మంచి విజన్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ అనేది కొత్త బంగారం లాంటిది. వారాహి సిల్వర్ జ్యువెలరీతో కలిసి పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రాండ్ నేషనల్ స్థాయిలో అద్భుతంగా ఎదగాలని కోరుకుంటున్నాను.
వారాహి మేనేజింగ్ డైరెక్టర్ మణిదీప్ ఏచూరి మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మా బ్రాండ్ అంబాసిడర్లైన తేజ గారు, మీనాక్షి గారికి ధన్యవాదాలు. ఈ బ్రాండ్‌ను స్థాపించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే, దాని ప్రభావం బంగారం ధరలపై పడుతుంది. ఇటీవల పెరిగిన బంగారం ధరల కారణంగా, కొన్ని కుటుంబాలు శుభకార్యాలను కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు మనం చూశాం. ఈ ట్రెండ్ గత రెండు మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. అందుకే, అందరికీ అందుబాటులో ఉండేలా, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా ఒక ప్రత్యామ్నాయం ఇవ్వాలనుకున్నాం. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ జ్యువెలరీ మొత్తం దాదాపు ఒక సంవత్సరం రీసెర్చ్ చేసి, అత్యుత్తమ క్రాఫ్ట్‌మన్‌షిప్‌తో తయారు చేయించాం. మా లక్ష్యం – సిల్వర్ జ్యువెలరీలో గోల్డ్‌లాంటి నమ్మకం, క్వాలిటీ ఇవ్వడం. ఇక్కడ ఉన్న డిజైన్స్‌లో ఏది గోల్డ్, ఏది సిల్వర్ అని గుర్తించడం కూడా కష్టం అనిపించేంత స్టాండర్డ్‌ను తీసుకొచ్చాం. మార్చి 28న కూకట్పల్లిలో మా బిగ్గెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభిస్తున్నాం. ఈ బ్రాండ్‌కు తేజ గారు, మీనాక్షి గారిని అంబాసిడర్లుగా గా వుండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారాహి సిల్వర్ జ్యువెలరీ భవిష్యత్తులో గోల్డ్‌లాగే రీసేల్, ఎక్స్చేంజ్ విలువ కలిగిన నమ్మకమైన బ్రాండ్‌గా నిలుస్తుంది. వచ్చే రెండేళ్లలో సౌత్ ఇండియాలో 20 బ్రాంచ్‌లు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామని నమ్ముతున్నాం.
వారాహి సిల్వర్ జ్యువెలరీ అందిస్తున్న ప్రత్యేకతలు:
అద్భుతమైన డిజైన్లు: సంప్రదాయం + ఆధునిక స్టైల్ కలయిక
పెద్ద బ్రైడల్ కలెక్షన్: పెళ్లికూతురికి కావాల్సిన అన్ని ఒకే చోట
ప్రీమియం క్వాలిటీ: నాణ్యమైన పని, మంచి ఫినిషింగ్
10,000కి పైగా ప్రొడక్ట్స్: విభిన్న డిజైన్లు
సరసమైన ధరలు: తక్కువ ఖర్చులో లగ్జరీ ఫీల్.
ఎక్స్చేంజ్ సదుపాయం: స్మార్ట్ కొనుగోలు అవకాశం.
భవిష్యత్తులో గోల్డ్ విజన్: ఇప్పుడు స్టైల్, తర్వాత పెట్టుబడి.
… ప్రకటన ఆవిష్కరణ & మీడియా ఇంటరాక్షన్
ఈ ప్రీ-లాంచ్ ఈవెంట్లో లో ప్రధాన ఆకర్షణ అధికారిక ప్రకటన విడుదల, తర్వాత మీడియా ఇంటరాక్షన్ సెషన్ జరిగింది. ప్రకటనలో రాజసత్వం, ఎలిగెన్స్ మరియు గ్రాండ్యూర్ ఎంతో అందంగా చూపించబడింది, వారాహిని ఒక ప్రీమియం అయినప్పటికీ సులభంగా ధరించగల బ్రాండ్ గా నిలబెట్టింది.
ప్రత్యేక ఆఫర్లు
కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్లు:
₹1,50,000 కొనుగోలు పై: ₹50,000 వోచర్ + గోల్డ్ & సిల్వర్ కాయిన్ ఉచితం
₹1,00,000 కొనుగోలు పై: ₹30,000 గిఫ్ట్ వోచర్ + సిల్వర్ కాయిన్ ఉచితం
₹50,000 కొనుగోలు పై: ₹15,000 గిఫ్ట్ వోచర్ + సిల్వర్ కాయిన్ ఉచితం
* ఆఫర్ ఏప్రిల్ 12 వరకు వర్తిస్తుంది.
మెగా లక్కీ డ్రా
కారు గెలుచుకునే అవకాశం
ఫ్రిజ్ గెలుచుకునే అవకాశం
ఏప్రిల్ 30వ తేదీన లక్కీ డ్రా నిర్వహించబడుతుంది.
* గ్రాండ్ లాంచ్ వివరాలు:
వారాహి సిల్క్, 1వ అంతస్తు, రోడ్ నంబర్ 1, మెట్రో పిల్లర్ A756 ఎదురుగా, కేపీహెచ్బీ ఫేజ్ 1, కుకట్పల్లి, హైదరాబాద్, తెలంగాణ 500072.
మార్చి 28 2026.
వారాహి సిల్వర్ జ్యువెలరీని మణిదీప్ యేచూరి, డా. స్పందన మద్దుల స్థాపించారు. స్టైల్, సరసమైన ధరలు, విభిన్న కలెక్షన్లు, అన్ని ఒకే చోట ఉండేలా ఒక ప్రత్యేక డెస్టినేషన్ గా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ముగింపు సందేశం:
రాయల్ క్యాంపెయిన్, భారీ కలెక్షన్, ఆకర్షణీయమైన ఆఫర్లలో వారాహి సిల్వర్ జ్యువెలరీ మాడ్రన్ మరియు బ్రైడల్ కస్టమర్లకు ఒక అద్భుతమైన ఎంపికగా మారడానికి సిద్ధంగా ఉంది.
అందరికీ ఆహ్వానం – ఈ గ్రాండ్ సెలబ్రేషన్లో భాగస్వాములు అవ్వండి!