హీరో నాగ శౌర్య, రామ్ దేశినా (రమేష్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘బ్యాడ్…
విశ్వక్‌సేన్ మూవీ గ్రాండ్ లాంచ్

ఎన్టీఆర్ దేవరతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ మరో భారీ సినిమాను రూపొందించటానికి సిద్ధమైంది. మాస్ కా దాస్‌గా అందరూ పిలుచుకునే విశ్వక్ సేన్ హీరోగా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు.
ప్రస్తుతానికి యువ సుధ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.3 అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించటంతో పాటు సమర్పకుడిగానూ వ్యవరిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి, స్క్రిప్ట్‌ను అందించారు.
ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు రజత్ దర్శకత్వం వహిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా, తేజస్ కృష్ణ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్స్ భాను భోగవరపు, నందు సవిరగాన డైలాగ్స్ రాస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.


