విశ్వక్ సేన్, #కల్ట్ సినిమా అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన ప్రతిష్టాత్మక చిత్రం #కల్ట్‌తో రాబోతున్నారు. విభిన్నమైన కథాంశాలతో ప్రయోగాలు చేసే విశ్వక్ ఈ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే కూడా రాస్తూ ప్రాజెక్ట్ పూర్తి బాధ్యతలను తీసుకున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియాస్ ఫస్ట్ అథెంటిక్ స్లాషర్ థ్రిల్లర్గా రూపొందిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపరిచే సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డార్క్, ఇంటెన్స్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా #CULT తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రపంచాన్ని, కథా నేపథ్యాన్ని పరిచయం చేస్తూ క్యూరియాసిటీ పెంచింది. అలాగే స్నేహాన్ని పరిచయం చేస్తూ…
