Skip to content

‘ఈఎన్ఈ రిపీట్’ నుంచి మురళీధర్‌గా ప్రియదర్శిని రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat’ లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రియదర్శిని రామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మురళీధర్‌గా ఆయన పాత్ర పరిచయం చేశారు. ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, అన్నీ ఈయనే చెప్పేలా ఉన్నాడు. అసలు ఎవరు ఈ మురళీధర్? #ENERepeat విమానంలో అతను ఏమి చేస్తున్నాడు? అంటూ మేకర్స్ రివిల్ చేసిన లుక్ ఆకట్టుకుంది.

2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ENE Repeat’ రూపొందుతోంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ వివేక్‌గా, అభినవ్ గోమఠం కౌశిక్‌గా, వెంకటేష్ కాకుమాను ఉప్పిగా, శ్రీనాథ్ మాగంటి కార్తీక్‌గా అలరించనున్నారు. తొలి పార్ట్ లో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నలుగురి గ్యాంగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ చిత్రానికి ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ సినిమా నవంబర్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

నటీనటులు: విశ్వక్ సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్
నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి
నిర్మాణ సంస్థలు: ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: ఏజే ఆరోన్
కో-డైరెక్టర్: ఉపేంద్ర వర్మ
ఎడిటర్: రవితేజ గిరిజాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సౌమిత్రి ఎన్
లైన్ ప్రొడ్యూసర్: శ్రీను ఈర్ల
మార్కెటింగ్, మోషన్ పోస్టర్: వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.