Skip to content

‘విశ్వంభర’ నుంచి త్రిషా కృష్ణన్‌ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

‘విశ్వంభర’ నుంచి త్రిషా కృష్ణన్‌ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ Telugu News

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ సోషియో-ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం విడుదలకు దగ్గరవుతోంది. చిరంజీవి పుట్టినరోజున విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రంలో హీరోయిన్ ‘అవని’ పాత్ర పోషించిన త్రిషా కృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఒక అద్భుతమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో, లేత రంగు సాంప్రదాయ దుస్తులలో, మృదువైన ఎంబ్రాయిడరీతో ఉన్న త్రిషా, వెలుగుతున్న దీపాల పళ్ళెం పట్టుకుని ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. గోల్డ్ కలర్ బ్యాక్ డ్రాప్ పోస్టర్‌కు పండుగ వాతావరణాన్ని జోడిస్తోంది.

దర్శకుడు వశిష్ట విజువల్ వండర్, మాస్ అప్పీల్ మేళవించి ‘విశ్వంభర’ను ఒక అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. చిరంజీవి కొత్త లుక్‌తో లార్జర్-దాన్-లైఫ్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా, మౌని రాయ్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు.

అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల ఈ చిత్రానికి పని చేస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ . ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందించగా, డ్యాన్స్ నెంబర్ కి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.

ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలు విఎఫ్ఎక్స్ వర్క్స్ నిర్వహిస్తున్నాయి. ‘విశ్వంభర’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఘనంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, స్పెషల్ సాంగ్ లో మౌని రాయ్

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి, భీమ్స్ సిసిరోలియో
DOP: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.