Skip to content

ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్

ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్ Telugu News

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ద్వారా సంజయ్ విశ్వనాథ్ అనే పాత్ర యొక్క ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భావోద్వేగాలతో నిండిన, ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించనుందని టీజర్ హామీ ఇస్తోంది.
టీజర్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను చూపించారు. 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిగా అతడిని పరిచయం చేశారు. సూర్య ఈ సినిమాలో తండ్రి ప్రేమ, భావోద్వేగ లోతు రెండూ కలిసిన ఒక గాఢమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన తెరపై కనిపించిన తీరు, వెంకీ అట్లూరి రాసిన ప్రభావవంతమైన సంభాషణలు.. సూర్య సినీ ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుతమైన ప్రదర్శనలను గుర్తు చేస్తున్నాయి.
కథకు కొత్తదనాన్ని జోడించే పాత్రలో మమితా బైజు కనిపిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాలో ఉత్సాహం, చురుకుదనం తీసుకొస్తుందని టీజర్ సూచిస్తోంది. వయస్సు అంతరం ఉన్న అసాధారణ ప్రేమకథను కూడా ఈ సినిమా చూపించబోతున్నట్టు టీజర్‌లో చూచాయగా తెలిపారు. సున్నితమైన భావోద్వేగాలతో అందమైన కథ చెప్పడం వెంకీ అట్లూరి శైలి. తనదైన ప్రత్యేక శైలి రచనతో.. ఈ అంశాన్ని కూడా లోతుగా, భావోద్వేగ పరిపక్వతతో మధురానుభూతిని కలిగించేలా చూపిస్తారు అనడంలో సందేహం లేదు.
‘విశ్వనాథ్ & సన్స్’ చిత్ర సాంకేతిక విలువలు ఉన్న స్థాయిలో ఉండబోతున్నాయని టీజర్‌ తో స్పష్టమైంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన శక్తివంతమైన నేపథ్య సంగీతం, విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి గొప్పగా, ఆకట్టుకునే ఫ్రేమ్‌లతో సినిమాను కెమెరాలో బంధిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడు బంగ్లాన్ ప్రేక్షకులను కథలో లీనం చేసేలా ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు.
బలమైన భావోద్వేగాలతో కూడిన భారీస్థాయి కుటుంబ కథా చిత్రంగా ‘విశ్వనాథ్ & సన్స్’ తెరకెక్కుతోంది. అద్భుతమైన తారాగణం, అగ్రశ్రేణి సాంకేతిక బృందాన్ని ఈ చిత్రం ఒకచోట చేర్చింది. ‘లక్కీ భాస్కర్’, ‘వాతి/సార్’ చిత్రాల విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరి, మరో చిరస్మరణీయ చిత్రాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ సినిమా, విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
చిత్రం: విశ్వనాథ్ & సన్స్
తారాగణం: సూర్య, మమిత బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
కళ: బంగ్లాన్
ఫైట్ మాస్టర్: వి. వెంకట్
కొరియోగ్రాఫర్: విజయ్ బిన్నీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యలమంచిలి గోపాలకృష్ణ
లైన్ ప్రొడ్యూసర్: ఉమామహేశ్వరరావు
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.