Skip to content

‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన, హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దర్శకుడు వెంకీ అట్లూరి తనదైన భావోద్వేగ కథనంతో రూపొందించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో ఒకటిగా ఈ చిత్రం నిలవనుంది. ట్రైలర్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను పరిచయం చేశారు. నలభై ఏళ్ల వయస్సు దాటినా తన కలలను వదలకుండా ముందుకు సాగే వ్యక్తిగా సూర్య కనిపించారు. స్టైల్, హాస్యం, ప్రేమ,…

Read more

బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.- పవన్ కళ్యాణ్

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సినిమా చిత్రీకరణలో గాయపడ్డారని తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్నాను. మజిల్ టేయర్ ఉందని చెప్పారు. శ్రీ బాలకృష్ణ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

Read more

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న ‘బ్రహ్మయుగం’

నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ నిర్మించిన ‘బ్రహ్మయుగం’ చిత్రం *72వ జాతీయ చలనచిత్ర అవార్డులు (2024)*లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకోవడం పట్ల ఎంతో గర్వంగా, ఆనందంగా ప్రకటిస్తున్నాము. ఈ చిత్రానికి లభించిన అవార్డులు: * ఉత్తమ ప్రధాన నటుడు – మమ్ముట్టి * ఉత్తమ సినిమాటోగ్రఫీ – షెహ్నాద్ జలాల్ ‘కొడుమోన్ పొట్టి’ పాత్రలో అసాధారణ నటనతో ప్రేక్షకులను, విమర్శకులను విశేషంగా ఆకట్టుకున్న శ్రీ మమ్ముట్టి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే, తన అద్భుతమైన ఛాయాగ్రహణంతో చిత్రానికి ప్రత్యేకమైన దృశ్య వైభవాన్ని అందించిన షెహ్నాద్ జలాల్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక గౌరవానికి ఎంపిక చేసిన భారత ప్రభుత్వ సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ,…

Read more

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు -పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి

నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం సంతోషకరం 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ నటులు శ్రీ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకం. నాలుగవసారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. శ్రీ మమ్ముట్టికి, ఆయనతోపాటు ఈ పురస్కారానికి శ్రీ కార్తీక్ ఆర్యన్ కు, ఉత్తమ నటిగా నిలిచిన శ్రీమతి యామీ గౌతమ్ కు అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు పురస్కారాలు దక్కడం శుభపరిణామం. ఉత్తమ పాపులర్ చిత్రంగా కల్కి 2898 ఎ.డి., ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కల్కి 2898…

Read more

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు

ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

Read more

‘VISA – వింటారా సరదాగా’ రెండో గీతం ‘చింగారి’కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

‘VISA – వింటారా సరదాగా’ చిత్ర బృందం రెండో గీతం 'చింగారి'ని విడుదల చేసింది. హృదయాన్ని హత్తుకునే బాణీలు అందించడంలో పేరుగాంచిన విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ఈ మెలోడీ గీతాన్ని, తన ప్రత్యేకమైన గానంతో శ్రోతలను అలరించే సిద్ శ్రీరామ్, లిప్సిక ఎంతో అందంగా ఆలపించారు. సనారే రచించిన 'చింగారి' పాట ప్రతి ఒక్కరి గుండెల్ని తాకేలా ఉంది. ప్రేమలోని నిశ్శబ్ద వేదనను, మనసులో రగిలే భావోద్వేగాలను ఎంతో కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది. మాటల్లో చెప్పలేని ప్రేమ అనుభూతిని సంగీతం ద్వారా అద్భుతంగా వ్యక్తపరిచే ఈ పాట ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేలా రూపొందింది. 'VISA - వింటారా సరదాగా' చిత్రం ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచుతోంది. ఈ చిత్ర…

Read more

‘సూపర్ సుబ్బు’తో మురళీ శర్మ ఓటీటీ ఎంట్రీ

జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు మురళి శర్మ ఇప్పుడు తన తొలి ఓటీటీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ద్వారా ఆయన డిజిటల్ ప్రపంచంలో అడుగుపెడుతున్నారు. ఈ సిరీస్‌లో మురళీ శర్మ కుక్కుటేశ్వరరావు అనే క్రమశిక్షణ, సంప్రదాయాలకు పెద్దపీట వేసే తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అయితే తన కుమారుడు సెక్స్ ఎడ్యుకేషన్ టీచర్‌గా మారాలనే నిర్ణయం తీసుకోవడంతో ఆయన నమ్మకాలు, ఆలోచనల్లో జరిగే మార్పుల చుట్టూ కథ సాగుతుంది. మాకిపూర్ అనే గ్రామం…

Read more

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో మరో భారీ చిత్రం.. దైవిక నేపథ్యంతో అద్భుత దృశ్య కావ్యం!

విజయాలు సాధించే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి. కానీ, చరిత్ర సృష్టించి, చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అద్భుతానికి శ్రీకారం చుట్టారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నటుడు-దర్శకుడు ద్వయం, భారతీయ చలనచిత్ర రంగంలో…

Read more
ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’ Telugu News

ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’

సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందుతోన్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో ఒక అద్భుతమైన కుటుంబ వినోదాన్ని అందించడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భావోద్వేగాలు, హాస్యం, హృదయాన్ని తాకే కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. టీజర్, టైటిల్ ప్రకటన వెలువడినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు…

Read more
శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ Telugu News

శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సినీ నిర్మాతలు భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మంగళవారం రాత్రి రాజమహేంద్రవరంలో పలువురు తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సంబంధిత విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నిర్మాతలు శ్రీ వై. రవిశంకర్, శ్రీ సూర్యదేవర నాగవంశీ, శ్రీ సాహు గారపాటి, శ్రీ కిలారు వెంకట సతీష్, శ్రీ చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు.

Read more