Skip to content

‘VISA – వింటారా సరదాగా’ రెండో గీతం ‘చింగారి’కి ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన

‘VISA – వింటారా సరదాగా’ చిత్ర బృందం రెండో గీతం ‘చింగారి’ని విడుదల చేసింది. హృదయాన్ని హత్తుకునే బాణీలు అందించడంలో పేరుగాంచిన విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చిన ఈ మెలోడీ గీతాన్ని, తన ప్రత్యేకమైన గానంతో శ్రోతలను అలరించే సిద్ శ్రీరామ్, లిప్సిక ఎంతో అందంగా ఆలపించారు.

సనారే రచించిన ‘చింగారి’ పాట ప్రతి ఒక్కరి గుండెల్ని తాకేలా ఉంది. ప్రేమలోని నిశ్శబ్ద వేదనను, మనసులో రగిలే భావోద్వేగాలను ఎంతో కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది. మాటల్లో చెప్పలేని ప్రేమ అనుభూతిని సంగీతం ద్వారా అద్భుతంగా వ్యక్తపరిచే ఈ పాట ప్రతి ఒక్కరికీ దగ్గరయ్యేలా రూపొందింది.

‘VISA – వింటారా సరదాగా’ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచుతోంది. ఈ చిత్ర టీజర్ ఒక సరికొత్త కథనంతో, విదేశాల్లోని తెలుగు విద్యార్థుల జీవితాన్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి గీతం ‘అనగనగా అమెరికా’ ఒక హుషారైన పాటగా నిలిచి, అన్ని వేదికల్లో అందరి మనసులను గెలుచుకుంది. సొంత ఊరిని వదిలి దూరంగా వెళ్ళి, విదేశాల్లో తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించే యువత భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రంగా ‘VISA – వింటారా సరదాగా’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇప్పుడు విడుదలైన ‘చింగారి’ పాటతో ఈ చిత్రం తనలోని రొమాంటిక్ కోణాన్ని ఆవిష్కరించింది. హృదయాన్ని తాకే స్వరాలు, సాహిత్యంతో ఈ పాట సంగీత ప్రియుల మనసులను గెలుచుకుంటోంది.

నూతన దర్శకుడు ఉద్భవ్ రఘు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అమెరికాలోని తెలుగు విద్యార్థుల జీవితాల నేపథ్యంతో ఎంతో వైవిధ్యంగా, హృద్యమైన భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందుతోంది. స్నేహం, ఆశయాలు, సాంస్కృతిక గుర్తింపు, ఊహించని ప్రేమ వంటి అంశాలను నేటి తరం ప్రేక్షకులు కోరుకునే విధంగా సరికొత్తగా ఆవిష్కరించనుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీసే అభిరుచి గల నిర్మాతలు కావడంతో ‘VISA – వింటారా సరదాగా’పై నమ్మకం మరింత పెరిగింది. ప్రతి కొత్త అప్‌డేట్‌తో ఈ సినిమా మరింత సానుకూల స్పందనను సొంతం చేసుకుంటోంది.

నటీనటులు: అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు
దర్శకత్వం: ఉద్భవ్ రఘు
సంగీతం: విజయ్ బుల్గానిన్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.