Skip to content

‘వృషకర్మ’ నా కెరీర్లో 100% బెస్ట్ మూవీ అవుతుంది. గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో నాగ చైతన్య

యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, SVCC, సుకుమార్ రైటింగ్స్ ‘నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ’ టెర్రిఫైయింగ్ సూపర్ నేచురల్ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్

యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్ దండుతో కలిసి నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రోజు, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.

గ్లింప్స్ ఒక భయానకమైన సన్నివేశంతో ప్రారంభమైయింది. ఒక దుష్ట శక్తి ప్రభావంలో ఉన్న వ్యక్తి ఒక చిత్రాన్ని గీయడం, ఒక్కసారిగా అతని లోపల నుంచి ఒక భయంకరమైన శక్తి గబ్బిలం రూపంలో బయటకు వచ్చి మరో వ్యక్తి తలలోకి దూసుకెళ్లి అతన్ని చంపేయడం వెన్నులో వణుకుపుట్టించేలా వుంది. ‘అతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు, విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది’ అనే వాయిస్ కథపై మరింత ఆసక్తిని పెంచింది. వృషకర్మ దుష్టశక్తిని ఎదుర్కొనేందుకు ముందుకు అడుగు వేస్తూ గ్లింప్స్ పూర్తి కావడం అదిరిపోయింది.

ఈ గ్లింప్స్ భారీ స్కేల్, అద్భుతమైన విజువల్స్, గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్‌తో ఆకట్టుకుంటోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఒక భారీ సినీమాటిక్ యూనివర్స్‌ను నిర్మించాలనే మేకర్స్ విజన్ స్పష్టంగా కనిపిస్తోంది.

నాగ చైతన్య రగ్గడ్, ఇంటెన్స్ అవతార్‌లో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్లలో కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, రా, ఫియర్స్ లుక్ గ్లింప్స్‌కు ప్రత్యేకంగా నిలుస్తోంది. దుష్ట శక్తులకు ఎదురొడ్డి నిలిచే యోధుడిలా ఆయన పాత్ర కనిపిస్తోంది.

స్పర్ష్ శ్రీవాస్తవ పోషించిన భయంకరమైన విలన్ పాత్ర మరో హైలెట్. ఆయన టెర్రిఫిక్ ప్రెజెన్స్ కథలో ఇంటెన్స్ ఘర్షణకు సంకేతాలు ఇస్తోంది. అలాగే హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి, జయరామ్ పోషించిన పాత్రను గ్లింప్స్ లో కీలకంగా కనిపించాయి.

దర్శకుడు కార్తిక్ దండు ఈ భారీ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్నీ జాగ్రత్తలు తీసుకొని రూపొందిస్తున్నారు. సినిమాపై ఉన్న భారీ అంచనాలను అందుకునేలా ఒక ఇమర్సివ్ సినీమాటిక్ అనుభూతిని ఇవ్వనున్నారు.

సినిమాటోగ్రాఫర్ రాహుల్ డి హెరియన్ అందించిన విజువల్స్ అద్భుతంగా కనిపిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాలా నిర్మించిన ప్రపంచం రిచ్‌గా అనిపిస్తోంది. అజినీస్ లోక్ నాథ్ అందించిన పవర్‌ఫుల్, హాంటింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఎడిటర్ నవీన్ నూలి చేసిన షార్ప్ కట్స్ కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. మొత్తంగా “వృషకర్మ” ఫస్ట్ గ్లింప్స్ ఒక టెర్రిఫిక్ సినీమాటిక్ అనుభూతిని అందిస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో యువ సామ్రాట్ నాగ చైతన్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వృషకర్మ గ్లింప్స్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్ చెప్పినట్టు ఇది నా కెరీర్లో 100% బెస్ట్ మూవీ కాబోతుంది. స్క్రిప్ట్ విన్నప్పుడే అనిపించింది. ఇంత పెద్ద స్కేల్ లో మిథికల్ థ్రిల్లర్ సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉండింది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. స్క్రిప్ట్ విన్నప్పుడే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కార్తీక్ బ్రిలియంట్ ఫిలిం మేకర్. కథ విన్నప్పుడే లార్జెర్ దెన్ లైఫ్ సినిమా అనిపించింది. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందించారు. కార్తిక్ అనుకున్నది 100% అచీవ్ చేశారు. కార్తీక్ గురించి లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే తన అంత మంచి సినిమా ఇచ్చాడు. అంచనాలన్నిటిని ఈ సినిమా అందుకుంటుంది. ఈ సినిమా చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో ఒక బెంచ్ మార్క్ అవుతుంది. అది నా ప్రామిస్. స్పర్శ్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మీనాక్షి, జయరాం గారు, సత్య అందరూ అద్భుతమైన నటీనటులు ఉన్నారు. రాజీవ్ అద్భుతమైన వీఎఫ్ క్స్ ఇచ్చాడు. అజినీస్ మ్యూజిక్, నాగేంద్ర గారి ప్రొడక్షన్ డిజైన్ చాలా గ్రాండ్ గా వుంటాయి. టీం అందరికీ థాంక్ యూ’అన్నారు.

డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విరూపాక్ష సినిమా ఇచ్చిన సుకుమార్ గారికి థాంక్యూ. సుకుమార్ గారు బాపి గారు మా ముగ్గురి కాంబోనేషన్ లో విరూపాక్ష చేశాం, ఆ సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరింత గొప్ప సినిమా తీసే అవకాశం ఆడియన్స్ ఇచ్చారు. ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా చేయడానికి కావలసిన సపోర్టు నిర్మాతల నుంచి ఉంది. ప్రతి దర్శకుడికి పనిచేసే హీరోతో వాళ్ల కెరీర్ బెస్ట్ ఫిలిం ఇవ్వాలని ఉంటుంది. చైతన్య గారికి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నాను. టెక్నీషియన్స్ అందరు కూడా అద్భుతంగా పని చేశారు. అన్ని పాత్రలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. స్పర్శ్ చేస్తున్న క్యారెక్టర్ మామూలుగా ఉండదు. ఆ పాత్రలో అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో మీరు కొత్త నాగచైతన్యని చూస్తారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

మ్యూజిక్ డైరెక్టర్ అజినిష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విరూపాక్ష సినిమా టాలీవుడ్ లో నాకు ఒక లాంచ్ పాడ్ అయింది వృషకర్మ చూసిన తర్వాత ఈ జోనర్ కి కార్తీక్ దండు ని మాస్టర్ అని పిలుస్తారు. తను ఒక్కడు మాత్రమే ఇలా ఆలోచించగలడు నాగచైతన్య గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నటీనటులు టెక్నీషియన్స్ అందరు కూడా అద్భుతంగా చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది.

స్పర్శ్ శ్రీ వాస్తవ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ గారికి, హీరో చైతు గారికి ధన్యవాదాలు. అందులో నా పెర్ఫార్మన్స్ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. కార్తీక్ ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది

ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర మాట్లాడుతూ.. అందరికి నమస్కారం ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే ఇంకా అద్భుతమైన సన్నివేశాలు ఇందులో చాలా ఉంటాయి. ఈ బ్యానర్ లో ప్రొడక్షన్ డిజైనర్ గా విరూపాక్ష సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. వృషకర్మ కథ కూడా అద్భుతంగా ఉంటుంది. అభిమానుల అంచనాలు అందుకునేలాగా ఈ సినిమా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడ రాజీపడకుండా సినిమాని నిర్మించారు. నాగచైతన్య గారు నిజంగా బంగారం. కథ కోసం ఎంతైనా కష్టపడతారు. ఈ సినిమా కోసం చైతన్య గారు చాలా ఎఫర్ట్ పెట్టారు. అభిమానులందరూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే సినిమా ఇది.

తారాగణం: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: రాగుల్ డి హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా