Skip to content

కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా “యూత్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా “యూత్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ Telugu News

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ “యూత్”. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. త్వరలోనే “యూత్” మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో కిరణ్ అబ్బవరం లాంఛ్ చేశారు. “యూత్”మూవీని తెలుగులోకి తీసుకొస్తున్న వినీత్, సందీప్ కిరణ్ అబ్బవరంతో చాలాకాలంగా ట్రావెల్ చేస్తున్నారు. కిరణ్ వారికి సపోర్ట్ గా నిలుస్తూ ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. “యూత్” ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లా అనిపిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకుంది. అలాగే ఇలాంటి తరహా కంటెంట్ తోనే వచ్చిన లిటిల్ హార్ట్స్ కూడా పెద్ద సక్సెస్ దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కు కావాల్సిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో వస్తున్న “యూత్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అలాంటి వైబ్స్ క్రియేట్ చేస్తోంది.
నటీనటులు – కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————-
స్క్రిప్ట్, డైరెక్షన్ – కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్
బ్యానర్ – పారవతా ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్ – కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్
తెలుగు రిలీజ్ – ఈ2సీ టాకీస్ (హౌస్ పుల్ వినీత్, సందీప్)
మ్యూజిక్ – జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ – వికి
ఎడిటర్ – నాష్
ఆర్ట్ డైరెక్టర్ – రాము తంగరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్ – కావ్య శ్రీరామ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – విజయ్ ఎంపీ
స్టంట్ – కలై కింగ్సన్
కొరియోగ్రఫీ – శోబి పాల్ రాజ్
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
సౌండ్ మిక్స్ – అర్వింద్ మీనన్
మార్కెటింగ్ – హౌస్ ఫుల్ డిజిటల్
పోస్టర్స్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.