Skip to content

‘వృషకర్మ’ కోసం నాగ చైతన్య ఫియర్సెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్

‘వృషకర్మ’ కోసం నాగ చైతన్య ఫియర్సెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ Telugu News
‘వృషకర్మ’ కోసం నాగ చైతన్య ఫియర్సెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ Telugu News
‘వృషకర్మ’ కోసం నాగ చైతన్య ఫియర్సెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ Telugu News

యువ సామ్రాట్ నాగ చైతన్య తన అప్ కమింగ్ నెవర్ బిఫోర్ మిథికల్ స్పెక్టకిల్ ‘వృషకర్మ’ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ‘విరూపాక్ష’తో బ్లాక్ బస్టర్ సాధించిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి, బాపినీడు ఈ వెంచర్‌ను సమర్పిస్తున్నారు. BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ‘వృషకర్మ’ గ్లింప్స్ అన్ని ప్లాట్‌ఫామ్‌లు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. వెంటనే వైరల్ అయ్యి భారీ సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇంటెన్స్ విజువల్స్, పవర్ ఫుల్ వరల్డ్ బిల్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచాయి, సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
మేకర్స్ ఈరోజు యువ సామ్రాట్ నాగ చైతన్యను ఫియర్సెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ లో ప్రజెంట్ చేసే సరికొత్త BTS స్టిల్స్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫోటోలు పాత్ర కోసం ఆయన చేసిన కఠినమైన ట్రాన్స్‌ఫర్మేషన్‌, అలాగే అర్జున్ పాత్రను సహజంగా తెరపై చూపించేందుకు పెట్టిన అంకితభావాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఒక BTS స్టిల్‌లో చైతన్య ఇంటెన్స్ గా వర్కౌట్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆ ఫోటోలో ఆయన ప్రత్యేకంగా ఈ పాత్ర కోసం తీర్చిదిద్దుకున్న లీన్, చిసెల్డ్ ఫిజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. వృషకర్మ ప్రపంచంలో పావర్ ఫుల్ అర్జున్ పాత్రను పోషించేందుకు ఆయన చూపిన క్రమశిక్షణ, అంకితభావం ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా వెల్లడవుతోంది.
మరో స్టిల్‌లో చైతన్య గాయాలతో, యుద్ధానికి సిద్ధమైన యోధుడిలా కనిపిస్తున్నారు. ఈ రఫ్ అండ్ రగ్డ్ లుక్ సినిమాలో ఉండబోయే హై-ఆక్టేన్ యాక్షన్‌తో పాటు ఎమోషన ని సూచిస్తోంది. ఇది చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నడూ కనిపించని ఇంటెన్స్ ఆన్‌స్క్రీన్ అవతార్‌లలో ఒకటిగా నిలవనుంది.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా మిస్టరీ, మైథాలజీ, యాక్షన్ అంశాలను కలిపి ఒక గొప్ప సినీమాటిక్ అనుభూతిని అందించబోతుంది.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వృషకర్మపై ఆసక్తి మరింత పెరిగింది. బిగ్ స్క్రీన్ పై నాగ చైతన్య పవర్ ఫుల్, విభిన్నమైన నటనను చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల థియేట్రికల్ హక్కులు సుమారు ₹45 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
తారాగణం: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, జయరామ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: కార్తీక్ దండు
నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి
బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్
సమర్పణ: బాపినీడు
సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్
సినిమాటోగ్రాఫర్: రాగుల్ డి హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.