Skip to content

ధురంధర్ ది రివెంజ్ నుంచి ‘ఆరి ఆరి’ టైటిల్ ట్రాక్ రిలీజ్

ధురంధర్ ది రివెంజ్ నుంచి ‘ఆరి ఆరి’ టైటిల్ ట్రాక్ రిలీజ్ Telugu News

ఇటీవల విడుదలైన ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్ 45+ దేశాలలో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ట్రైలర్ విడుదలైనప్పటి నుండి అభిమానులు ‘ఆరి ఆరి’ పాటను హమ్ చేస్తున్నారు, దీనిని బీజీఎం గా ఉపయోగించారు. పాట విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
హై ఎనర్జీ పాట ఇప్పుడు T-సిరీస్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. ఎనర్జిటిక్ బీట్‌లు, పవర్ ఫుల్ వాకల్స్, రాప్ పార్ట్స్ కూడిన ఈ పాట, వైరల్ గా మారి సినిమా ఇంటెన్స్ వరల్డ్ ని ప్రజెంట్ చేస్తోంది.
శశ్వత్ సచ్‌దేవ్ ఈ ట్రాక్‌ను ఆయనే కంపోజ్ చేసి, అరేంజ్ చేసి, ప్రోగ్రామ్ చేశారు. మోడరన్ మ్యూజిక్ ప్రొడక్షన్‌ను పంజాబీ శైలితో కలిపి రూపొందించిన ఈ పాట వినగానే ఉత్సాహాన్ని పెంచే ఎనర్జీతో రూపొందింది.
ఈ పాటను నవతేజ్ సింగ్ రెహాల్ (బాంబే రాకర్స్), ఖాన్ సాబ్, జాస్మిన్ సండ్లాస్, సుధీర్ యాదువంశీ గాత్రంలో ఆలపించగా, ర్యాప్ భాగాలను రెబల్, టోకెన్ రాసి పాడారు. పాటకు పదాలను ప్రముఖ రచయిత ఇర్షాద్ కామిల్ బాంబే రాకర్స్‌తో కలిసి రాశారు. మ్యూజిక్ స్కోర్‌ను ఆడమ్ లూకాస్ రూపొందించారు.
ఈ పాటకు రూపొందించిన మ్యూజిక్ వీడియో విజువల్ గా కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో రణవీర్ సింగ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంటారు. స్టైలిష్ యాక్షన్ షాట్లు, ఉత్కంఠభరిత సన్నివేశాలు వీడియోకు భారీ స్థాయి ఇంటెన్స్ ను తీసుకొచ్చాయి.
ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్, డైనమిక్ విజువల్స్ కలయికగా రూపొందిన “ఆరి ఆరి” పాట ఈ సినిమాకు మ్యూజిక్ జర్నీని పవర్ ఫుల్ గా ప్రారంభిస్తూ హై-ఆక్టేన్ ఇంపాక్ట్‌ను అందిస్తుంది.
జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రానికి ఆదిత్య ధర్ కథ, దర్శకత్వం అందించగా జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంగా, ఈద్‌కు ముందు ‘ధురంధర్: ది రివెంజ్’ థియేటర్లలో విడుదల కానుంది
అజ్ఞాత వీరుల కథ ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.