Skip to content

‘బైకర్’ కోసం శర్వానంద్ ప్రిపరేషన్ & ట్రైనింగ్

‘బైకర్’ కోసం శర్వానంద్ ప్రిపరేషన్ & ట్రైనింగ్ Telugu News
‘బైకర్’ కోసం శర్వానంద్ ప్రిపరేషన్ & ట్రైనింగ్ Telugu News
‘బైకర్’ కోసం శర్వానంద్ ప్రిపరేషన్ & ట్రైనింగ్ Telugu News

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా బైకర్ ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రతి కొత్త అప్‌డేట్‌తో ఉత్సాహాన్ని పెంచుతూనే ఉంది. క్యారెక్టర్ గ్లింప్స్, సినిమాలోని మొదటి రెండు సింగిల్స్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

శర్వా బైకర్ కోసం టాప్ గేర్‌లోకి మారారు. ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో చూస్తేఈ ప్రాజెక్ట్‌ కోసం ఎంత కష్టపడ్డారో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడాయన శరీరం మరింత లీన్‌గా, అథ్లెటిక్‌గా కనిపిస్తోంది. చక్కగా తీర్చిదిద్దిన మిడ్‌సెక్షన్, కట్ షోల్డర్స్, డిఫైన్డ్ అప్పర్ బాడీ ఆయన నెలల తరబడి చేసిన కఠినమైన ట్రైనింగ్‌ను చూపిస్తున్నాయి. ఇది కేవలం లుక్ కోసం చేసిన మార్పు కాకుండా, పద్ధతిగా ప్లాన్ చేసిన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్.

మోటోక్రాస్ రేసింగ్ ప్రపంచాన్ని నిజంగా చూపించేందుకు శర్వా ప్రత్యేకమైన ట్రైనింగ్‌ను తీసుకున్నారు. ఆయన వర్కౌట్స్‌లో స్ట్రెంగ్త్ సర్క్యూట్స్, కోర్ స్టెబిలైజేషన్ ఎక్సర్‌సైజులు, ఎక్స్‌ప్లోసివ్ పవర్ డ్రిల్స్ ఉన్నాయి. భారీ టార్క్ ఉన్న మోటార్‌సైకిళ్లను అత్యంత వేగంతో నియంత్రించాల్సిన మోటోక్రాస్ రేసింగ్ కి తగినట్లు ఈ ట్రైనింగ్ రూపొందించబడింది.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జె యువరాజ్ సినిమాటోగ్రఫీని, రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తాడు, ఎ. పనీర్ సెల్వం ఆర్ట్ డైరెక్షన్‌, అనిల్ కుమార్ పి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

బైకర్ ప్రేక్షకులకు లీనమయ్యే థియేటర్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి డాల్బీ సినిమా, EPIQ, 4DX , PCX వంటి ప్రీమియం ఫార్మాట్‌లలో కూడా విడుదల అవుతుంది.

నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
డీవోపీ: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.