Skip to content

జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్  ‘జమాన’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!! Telugu News
జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!! Telugu News
జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!! Telugu News

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు హీరో ఆకాష్ పూరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ…
జమాన ట్రైలర్ బాగుంది, చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, మంచి కాన్సెప్ట్ తో జనవరి 30న విడుదల కాబోతున్న ఈ మూవీని అందరూ థియేటర్స్ లో చూసి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను, క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తోన్న ఈ సినిమా అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలనుకున్తున్నాను అన్నారు.

దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ…
జమాన సినిమా డిఫరెంట్ గా ఉంటుంది, మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తీయడం జరిగింది. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత తేజస్వి అడప గారికి కృతజ్ఞతలు, మా చిత్ర యూనిట్ కు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కేశవ కిరణ్ మాట్లాడుతూ…
జమాన సినిమాను దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నను. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి కృతఙ్ఞతలు, మా సినిమాను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన హీరో ఆకాష్ పూరికి కృతజ్ఞతలు తెలిపారు.

హీరో సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ… కష్టపడి చేసిన జమాన సినిమా జనవరి 30న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది, చాలా నమ్మి, ప్రాణం పెట్టి మేము ఈ సినిమా చేశాం మా వర్క్ మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాము అన్నారు.

‘నేటి యువతరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. హైదరాబాద్‌ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. జమాన చిత్రంలో చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది’ . నేటి యూత్‌కి కనెక్ట్‌ అయ్యే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. స్వాతి కశ్యప్‌, జారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగన్‌ ఏ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: కేశవ కిరణ్‌, రచన-దర్శకత్వం: భాస్కర్‌ జక్కుల.

Zamana movie coming theaters on Jan 30

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.