మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
“లిటిల్ హార్ట్స్” సినిమా ప్రేక్షకులందరి మనసు గెలుచుకోవాలంటూ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా అన్ని కేంద్రాల నుంచి సూపర్ హిట్ టాక్ తో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా “లిటిల్ హార్ట్స్” సినిమాకు బెస్ట్ విశెస్ అందించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. తనకు ఇష్టమైన టీమ్ ఈ చిత్రానికి పనిచేసిందని, “లిటిల్ హార్ట్స్” సినిమా ప్రేక్షకులందరి మనసు గెలుచుకోవాలని విజయ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. త్వరలోనే “లిటిల్ హార్ట్స్” సినిమా చూస్తానని విజయ్ దేవరకొండ తెలిపారు.
“లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు.
నటీనటులు – మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం – సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ – ఆదిత్య హాసన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మ్యూజిక్ – సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ – సూర్య బాలాజీ
ఎడిటర్ – శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ – దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – వినోద్ నాగుల, మురళి పున్న
