సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి హీరోయిన్గా జాన్వి ఎంట్రీ
సూపర్స్టార్ కృష్ణ ఘట్టమనేని వారసత్వం తెలుగు సినీ పరిశ్రమలో విశిష్టమైనది. ఇప్పుడు ఘట్టమనేని లెగసీ నుంచి తొలిసారిగా హీరోయిన్గా వెలుగులోకి రానున్నది జాన్వి ఘట్టమనేని. ఆమె తన తాత కృష్ణగారి గ్రేస్, తన మామ మహేష్ బాబు గారి మాగ్నటిజం, తల్లి మంజుల ఘట్టమనేని గారి ఆత్మీయతను తనలో కలుపుకుని గొప్ప వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంది. జాన్వి ఘట్టమనేని క్లాసిక్ బ్యూటీ. ఇటీవల వెలుగుచూసిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాలు ఆమెను “ఇటీవలి తెరపై కనిపించే అత్యంత అందమైన అమ్మాయి' గా అభివర్ణిస్తున్నాయి. జాన్వి ఎటువంటి హడావుడి లేకుండా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని ఫొటోలు, కొన్ని టెస్ట్ రీల్స్ ద్వారానే తన చార్మ్ చూపించింది. దర్శకులు…
