Dharmasthala Niyojakavargam – Movie Review Release Date: 04 September 2026 Rating: 3.5/5…
“క” సినిమాకు గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ గెల్చుకున్న దర్శకద్వయం సందీప్, సుజీత్
కిరణ్ అబ్బవరం హీరోగా “క” చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని అందుకున్న దర్శకులు సందీప్, సుజీత్ ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ లోనూ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డ్స్ లో సందీప్, సుజీత్ లకు స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనౌన్స్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గద్దర్ అవార్డ్స్ లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ దక్కడం ఈ దర్శకుల ప్రతిభకు లభించిన సరైన గౌరవంగా చెప్పుకోవచ్చు.
“క” మూవీ టీమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ తమ సంతోషాన్ని షేర్ చేసుకుంది. క” చిత్రంతో దర్శకులు సందీప్, సుజీత్ తమ ప్రయత్నంలోనే ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. గతేడాది దీపావళికి రిలీజైన “క” సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. త్వరలో మరిన్ని ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు దర్శకులు సందీప్, సుజీత్.

