Skip to content

రాజ్‌తరుణ్‌-విజయ్ మిల్టన్ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ముఖ్యపాత్రలో నటించనున్న ‘ప్రేమిస్తే’ భరత్‌

tharun

రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్‌ తరుణ్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో ‘ప్రేమిస్తే’ భరత్‌ కీలక పాత్రను పోషించనున్నాడు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్‌ చేస్తోంది.

కాదల్, పట్టియల్, కాలిదాస్ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్, ఈ సినిమాలో ఎమోషనల్‌ అండ్‌ ఎనర్జీ నండిన పాత్రను పోషిస్తున్నాడు. కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా భరత్‌ కనిపించనున్న ఈ పాత్ర అందర్ని అలరించే విధంగా ఉంటుంది. తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్‌ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్‌ ఇండియన్‌ రేంజ్‌ వచ్చినట్లు అయింది.

దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ:“భరత్‌ ఎంతో నిబద్దత గల నటుడు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర కథలో ఎంతో ఇంపార్టెంట్‌ పాత్ర. కథను మలుపు త్రిప్పే ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కూడా ఎంతో ప్లస్‌ అయ్యే విధంగా ఉంటుంది.

ఈ సినిమాలో ఇప్పటికే ఆసక్తికరమైన తారాగణం భాగమవుతోంది – నటుడు ఆరి తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతుండగా, రాజ్ తరుణ్ తమిళంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే, సంగీత దర్శకుడు పాల్ డబ్బా నటుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పుడు భరత్‌ చేరికతో ఈ కాంబినేషన్ మరింత బలపడింది.

సామాజిక నేపథ్యం కలిగిన, గాఢమైన భావోద్వేగ కథనాన్ని అందించడంలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచే విజయ్ మిల్టన్‌ ఈ చిత్రంలో కూడా అదే స్థాయిని చూపించబోతున్నారని తెలుస్తోంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.